సాయిపల్లవి.. ఆ సినిమా కోసం నిజంగా హెయిర్ కట్ చేసిందా

ABN , Publish Date - Nov 07 , 2026 | 08:35 PM

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty ), కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ( Dhanush) కాంబినేషన్‌లో తెరకెక్కతున్న భారీ బడ్జెట్ యాక్షన్ ఎపిక్ ఓమ్ (OM). గ్లోబల్ స్థాయిలో అంచనాలు పెంచుకుంటున్న ఈ మోస్ట్ క్రేజీ మల్టీస్టారర్ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్ గా నటించారు.

Sai Pallavi

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty ), కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ( Dhanush) కాంబినేషన్‌లో తెరకెక్కతున్న భారీ బడ్జెట్ యాక్షన్ ఎపిక్ ఓమ్ (OM). గ్లోబల్ స్థాయిలో అంచనాలు పెంచుకుంటున్న ఈ మోస్ట్ క్రేజీ మల్టీస్టారర్ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నవంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు.


తాజాగా ఈ చిత్రానికి సంబంధించి జరిగిన ఒక మీడియా చిట్‌చాట్‌లో శ్రీలీల.. హీరోయిన్ సాయిపల్లవి పాత్రకు సంబంధించిన ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఈ సినిమాలో సాయిపల్లవి.. నిత్యా రెడ్డి అనే పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుంది. బాబ్ కట్ హెయిర్ స్టైల్ తో చాలా స్టైలిష్ గా కనిపించింది. ఇక ఈ లుక్ కోసం ఆమె తన పొడువాటి జుట్టును కత్తిరించుకుందని శ్రీలీల తెలిపింది. సాధారణంగా హీరోయిన్లు విగ్గులు లేదా ప్రాస్థెటిక్ మేకప్‌తో మేనేజ్ చేస్తారు . కానీ, పాత్ర పట్ల ఉన్న నిబద్ధతతో సాయిపల్లవి నిజంగానే హెయిర్ క్రాప్ చేయించుకోవడం చూసి తాను షాక్ అయ్యానని శ్రీలీల ప్రశంసల జల్లు కురిపించింది.


నిజంగా సాయిపల్లవి తీసుకున్న నిర్ణయం చాలా ధైర్యంతో కూడుకున్నది. ఆమె తన చిన్నతనం నుంచి పొడువాటి కురులపై చాలా జాగ్రత్త వహిస్తాను అని చెప్పుకొచ్చింది. అలాంటి జుట్టును ఆమె ఒక సినిమా కోసం కట్ చేసుకోవడం అనేది చాలా కఠినమైన నిర్ణయమని, కానీ సాయిపల్లవి ఈజీగా చేసిందని.. అది ఆమెకు పాత్ర మీద ఉన్న నిబద్దత అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.ఇందులో ధనుష్, మమ్ముట్టి మధ్య వచ్చే ముఖాముఖి సన్నివేశాలు, డ్రామా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దానికితోడు సాయిపల్లవి నటించే ఈ డిఫరెంట్ క్యారెక్టర్ కథను పూర్తిగా మలుపు తిప్పే విధంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు.


మొత్తానికి సాయిపల్లవి హెయిర్ కట్ చేయించుకుందనే వార్త బయటకు రావడంతో ఓమ్ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గ్లామర్ కంటే కూడా అభినయానికే పెద్దపీట వేసే సాయిపల్లవి, ఈ చిత్రంతో మరోసారి నేషనల్ లెవెల్‌లో తన నటనతో మెస్మరైజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ సినిమాతో ఆమె ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Nov 07 , 2026 | 08:39 PM