సూపర్ హిట్ మండాడి.. అప్పుడే ఓటీటీకా
ABN , Publish Date - Oct 03 , 2026 | 09:04 PM
కోలీవుడ్‌లో హామీ లేని కామెడీ నటుడి నుంచి పవర్‌ఫుల్ హీరోగా ఎదిగిన తమిళ నటుడు సూరి (Soori), అలాగే టాలీవుడ్ నుంచి తమిళంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సుహాస్ (Suhas) కాంబినేషన్ రూపొందిన సముద్రపు బ్యాక్‌డ్రాప్ సస్పెన్స్ యాక్షన్ డ్రామా మండాడి(Mandaadi).
కోలీవుడ్‌లో హామీ లేని కామెడీ నటుడి నుంచి పవర్‌ఫుల్ హీరోగా ఎదిగిన తమిళ నటుడు సూరి (Soori), అలాగే టాలీవుడ్ నుంచి తమిళంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సుహాస్ (Suhas) కాంబినేషన్ రూపొందిన సముద్రపు బ్యాక్‌డ్రాప్ సస్పెన్స్ యాక్షన్ డ్రామా మండాడి(Mandaadi). మథిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, ఈ ఏడాది అతిపెద్ద సాలిడ్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది.
ఇక ఈ విజయం తర్వాత ఈ చిత్రం ఓటీటీ వేదికపైకి రాక కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ బాట పట్టినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నట్లు విస్తృతంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ఇంత పెద్ద హిట్ సినిమా నెల తిరక్కుండానే ఓటీటీ బాట పట్టడం నెటిజన్స్ ని ఆశ్చర్యపరుస్తుంది.
కథ విషయానికొస్తేసముద్ర తీరప్రాంత గ్రామంలో సంప్రదాయ పడవల పందెం, మత్స్యకారుల హక్కుల కోసం పోరాడే యోధుడు ముత్తుకాళి అలియాస్ కాళి (సూరి). ఈ గ్రామస్తులందరికీ గురువులా, పెద్దదిక్కుగా మాచముని (సత్యరాజ్) వ్యవహరిస్తుంటాడు. పందెంలో, తీరప్రాంత వేట భూములపై ఆధిపత్యం చెలాయించేందుకు గ్రామానికి చెందిన ప్రత్యర్థి వర్గం నాయకుడు సాట్టపులి (సుహాస్) కుట్రలు పన్నుతుంటాడు. కాళి మాజీ ప్రియురాలు ఏంజెల్ (మహిమా నంబియార్), ఆమె భర్త సింగారం (రవీంద్ర విజయ్) కుటుంబాల మధ్య ఉన్న పాత పగలను ఆసరాగా చేసుకుని సాట్టపులి పందెంలో గెలవడానికి, కాళి వర్గాన్ని తొక్కిపెట్టడానికి మైండ్ గేమ్‌లు ఆడుతాడు. ఈ క్రమంలో జరిగే సముద్రపు పందెంలో కాళి తన తెగువతో సాట్టపులి కుట్రలను ఎలా తిప్పికొట్టాడు? అనేదే మిగతా కథ. థియేటర్ లో హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.