సినిమా రిలీజ్ కి ముందే డైరెక్టర్‌కు శివకార్తికేయన్ బంపర్ గిఫ్ట్
ABN , Publish Date - Nov 02 , 2026 | 07:44 PM
ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తోంది. సినిమా హిట్ అయితే.. నిర్మాతలు డైరెక్టర్ కి, హీరోకి కాస్ట్లీ కార్లను, వాచ్ లను, చిత్రబృందానికి గోల్డ్ కాయిన్స్ ని బాహుమతులుగా ఇస్తూ ఉంటారు.
ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తోంది. సినిమా హిట్ అయితే.. నిర్మాతలు డైరెక్టర్ కి, హీరోకి కాస్ట్లీ కార్లను, వాచ్ లను, చిత్రబృందానికి గోల్డ్ కాయిన్స్ ని బాహుమతులుగా ఇస్తూ ఉంటారు. ఈమధ్యే లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సిరీస్ హిట్ అవ్వడంతో వైవా హర్ష.. డైరెక్టర్ కి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. అంతేకాకుండా చిత్రబృందానికి కాస్ట్లీ వాచ్ లను కూడా గిఫ్ట్ ఇచ్చాడు. ఇక్కడవరకు బాగానే ఉంది. కానీ, సినిమా నకా రిలీజ్ అవ్వకముందే ఒక స్టార్ హీరో డైరెక్టర్ కి కాస్ట్లీ ఐఫోన్ ని గిఫ్ట్ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ హీరో ఎవరో కాదు శివకార్తికేయన్ (Sivakarthikeyan) .
ప్రస్తుతం శివకార్తికేయన్ తన 27వ చిత్రం పార్కింగ్ ఫేమ్ నేషనల్ అవార్డ్ విన్నర్ రామకుమార్ బాలకృష్ణన్ తో చేస్తోన్న విషయం తెల్సిందే. సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో శివకార్తికేయన్ సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈమధ్యనే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా హీరో, రామకుమార్‌కు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఫస్ట్ షెడ్యూల్ చాలా బాగా రావడంతో డైరెక్టర్ టేకింగ్ కి ముగ్ధుడైన శివకార్తీకేయన్ రామకుమార్‌కు బ్రాండ్ న్యూ ఐఫోన్‌ను కానుకగా అందించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న రామకుమార్.. 'శివకార్తికేయన్ అన్న నుంచి ఒక లవ్లీ సర్ప్రైజ్ వచ్చింది. థ్యాంక్స్ అన్నా, ఇది నాకు చాలా ప్రత్యేకమైనది' అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
ఇక ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో శివకార్తీకేయన్ నటించిన డాన్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ చిత్రం కూడా అదే రేంజ్ లో ఉండబోతుందని టాక్. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు శివకార్తీకేయన్ సీయోన్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా కూడా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాలతో ఈ కుర్ర హీరో ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.