'ఇండియన్-3' లేనట్టేనా?

ABN , Publish Date - Nov 29 , 2026 | 11:03 AM

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో రావాల్సిన ‘ఇండియన్ 3’ సినిమాపై మళ్లీ సందేహాలు మొదలయ్యాయి.

indian 3 Kamal Haasan

ఎస్.శంకర్ (Shankar) దర్శకత్వంలో అగ్ర నటుడు కమల హాసన్ (Kamal Haasan) నటించిన 'ఇండియన్' చిత్రం (Indian 3) మూడో భాగం నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టును అటకెక్కించారనే ప్రచారం కోలీవుడ్‌లో సాగుతోంది. 2024లో ఈ చిత్ర రెండో భాగం వచ్చింది. చిత్రం ముగింపు కార్డులో మూడో భాగానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చూపించారు. రెండో భాగం హిట్ అయివుంటే మూడో భాగం కూడా ఇప్పటికే విడుదలైవుండేది. కానీ, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవి చూసింది. దీంతో మూడో భాగంపై సందేహం -నెలకొంది.

ఈ నేపథ్యంలో గత అక్టోబరులో మూడో భాగంపై మేకర్స్ కీలక అప్డేట్ ఇస్తూ 2027 లో 'ఇండియన్-3' విడుదల ఉంటుందని ప్రకటించారు. అయితే, మూడో భాగం కోసం మరో 10 లేదా 15 రోజుల పాటు చిత్రీకరణ జరపాలని దర్శకుడు శంకర్ నిర్మాతలకు చెప్పగా వారు కూడా సమ్మతం తెలిపారు.

కానీ, హీరో కమల్ తన సొంత ' చిత్రం 'ఛండియర్ చిత్రీకరణలో బిజీగా ఉండటంతో 'ఇండియన్-3' షూటింగ్‌కు తేదీలను కేటాయించలేకపోతున్నారు. అదే సమయంలో తాజాగా నగరానికి వచ్చిన నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్‌ను దర్శకుడు కలిసేందుకు ప్రయత్నించగా, అది సాధ్య పడలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో 'ఇండియన్ ' మూడో భాగం ఇక లేనట్టేనని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

Updated Date - Nov 29 , 2026 | 11:03 AM