త్రిష స్థానంలో నేను ఉంటే అలా చేసేదాన్ని.. నటి అంబిక సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 16 , 2026 | 01:02 PM

ఇండస్ట్రీలో దళపతి విజయ్ (Vijay), స్టార్ హీరోయిన్ త్రిష (Trisha)ల మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం, స్నేహం గురించి గత కొంతకాలంగా నెట్టింట రకరకాల ప్రచారాలు, విమర్శలు సాగుతున్న సంగతి తెలిసిందే.

Trisha

ఇండస్ట్రీలో దళపతి విజయ్ (Vijay), స్టార్ హీరోయిన్ త్రిష (Trisha)ల మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం, స్నేహం గురించి గత కొంతకాలంగా నెట్టింట రకరకాల ప్రచారాలు, విమర్శలు సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి వేడుకలో విజయ్ పక్కన త్రిష ఉంటూనే వస్తుంది. వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కొందరు స్నేహం అంటుంటే.. ఇంకొందరు ప్రేమ అంటున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈమధ్య విజయ్ కూడా త్రిష గురించి భయపడుతున్నారు. రీసెంట్‌గా విజయ్‌తో కలిసి త్రిష లండన్‌లో జరిగిన కార్ రేసింగ్ వేడుకల్లో కలిసి కనిపించడంతో ఈ విషయం మళ్లీ తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా ఈ వివాదంపై సీనియర్ నటి అంబిక స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర కలకలం రేపుతున్నాయి.


ఒక ఇంటర్వ్యూలో అంబిక మాట్లాడుతూ.. ఇద్దరు వ్యక్తులు మంచి స్నేహితులుగా ఉన్నప్పుడు వారిలో ఒకరు సమాజంలో అత్యున్నత స్థానానికి లేదా బాధ్యతాయుతమైన పదవిలోకి వెళ్తే, ఆ స్నేహాన్ని అంత సులభంగా కాదనలేమని, అసలు వదలుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే.. ఆ స్నేహం వలన, ఒక వ్యక్తి వలన మరొక వ్యక్తికి నెగెటివ్ ఇమేజ్ లేదా విమర్శలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు, ఆ వ్యక్తిపై నిజమైన గౌరవం ఉన్న స్నేహితులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని, తన వలన బాధపడుతుంటే స్నేహన్ని వదిలినా తప్పు లేదని చెప్పుకొచ్చింది.


త్రిష స్థానంలో తను ఉండి ఉంటే ఎలా ప్రవర్తించేదో అంబిక స్పష్టంచేసింది. 'ఒకవేళ నేను త్రిష స్థానంలో ఉండి ఉంటే.. నా వల్ల నా స్నేహితుడికి లేదా ఆ వ్యక్తికి అనవసరమైన నెగెటివిటీ, విమర్శలు వస్తున్నాయని అనిపిస్తే వెంటనే అక్కడి నుంచి తప్పుకునేదాన్ని. ఆయనతో కలిసి బహిరంగంగా తిరగడం లేదా వేడుకలకు వెళ్లడం ఖచ్చితంగా మానేసేదాన్ని" అని అంబిక పేర్కొంది. స్నేహాన్ని కాపాడుకోవడంతో పాటు ఇతరుల ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండటం ముఖ్యమని ఆమె అభిప్రాయపడింది.


అదే సమయంలో, విజయ్ లేదా త్రిషల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం తన ఉద్దేశం కాదని, ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని అంబిక స్పష్టం చేసింది . సీనియర్ నటిగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నిజంగా అంబికా చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్ కి అనవసరమైన నెగిటివిటీ లేకుండా చేయాలని త్రిష ప్రయత్నించేది. కానీ, ఆమె అలా చేయడం లేదు. అటెన్షన్ కోసం చూస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ముందు ముందు త్రిష.. ఏం చేయబోతుందో చూడాలి.

Updated Date - Sep 16 , 2026 | 01:02 PM