సీఎంతో సమంత.. ఫోటోలు వైరల్

ABN , Publish Date - Jun 17 , 2026 | 09:40 PM

దళపతి విజయ్ (Vijay) సీఎం అయ్యాక.. సెలబ్రిటీలు అందరూ ఆయనను స్వయంగా కలిసి అభినందిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్స్ అందరూ విజయ్ ని కలిశారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సైతం విజయ్ ని కలిసి అభినందించారు.

Vijay- Samantha

దళపతి విజయ్ (Vijay) సీఎం అయ్యాక.. సెలబ్రిటీలు అందరూ ఆయనను స్వయంగా కలిసి అభినందిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్స్ అందరూ విజయ్ ని కలిశారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సైతం విజయ్ ని కలిసి అభినందించారు. ప్రస్తుతం ఆమె నటించిన మా ఇంటి బంగారం తమిళ్ లో కూడా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్లిన సామ్.. విజయ్ ని కలిశారు. విజయ్ - సమంత కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. పోలీసోడు, అదిరింది సినిమాల్లో విజయ్ సరసన సమంత నటించారు. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇన్నాళ్ల తరువాత సామ్.. విజయ్ ని కలవడంతో ఆమె ఎమోషనల్ అయ్యారు. సీఎం అవ్వడానికి విజయ్ అర్హులు అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు.


'ఈ రోజు నేను చెన్నైలో అడుగుపెట్టగానే నా హృదయం ఎంతో సంతోషంతో నిండిపోయింది, ఎందుకంటే నేను మన ముఖ్యమంత్రి విజయ్ గారిని కలిశాను. విజయ్ సర్ కేవలం వెండితెరపై మాత్రమే హీరోగా మిగిలిపోయే వ్యక్తి కాదని నేను ఎప్పుడూ నమ్ముతాను. ఆయనలోని ఎనర్జీ, ఆయనకున్న వ్యక్తిత్వం, ప్రజలు ఆయనపై చూపే ఆదరణ చూస్తుంటేనే విజయ్ అంతకంటే ఏదో ఒక పెద్ద రంగాన్ని శాసించడానికి పుట్టారని నాకు అనిపిస్తూ ఉంటుంది. అన్నింటికంటే నన్ను ఎక్కువగా ఇన్‌స్పైర్ చేసింది ఏమిటంటే.. ఇప్పటికే ఒక రంగంలో తిరుగులేని నంబర్ వన్ స్థానాన్ని సంపాదించి.. దానిని వదిలేసి, రిస్క్, బాధ్యతలు ఎంతో ఎక్కువగా ఉండే సరికొత్త రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడానికి ఆయన చూపించిన అసాధారణమైన ధైర్యం. ఆయన ఈ నిర్ణయం తీసుకున్నది ఏది ఏమైనా ఇది సులభం అని కాదు, కేవలం సమాజంలో ఒక మంచి మార్పును తీసుకురాగలననే గట్టి నమ్మకంతోనే ఈ అడుగు వేశారు.


మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే పిలుపు వస్తుంది, కానీ ఆ పిలుపుని అందుకోవడానికి చాలా తక్కువ మందికే ధైర్యం ఉంటుంది. ఆ అతికొద్ది మందిలో విజయ్ సర్ ఒకరు. పదవి కోసం కాకుండా ప్రజలకు మంచి చేయాలనే కచ్చితమైన ఉద్దేశంతోనే ఆయన ఈ బాధ్యతను స్వీకరించారు. ఆయనకు భగవంతుడు మరింత బలాన్ని, వివేకాన్ని, అనుకున్న మార్గంలో నిలబడే ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.. అలాగే ఈ ప్రయాణాన్ని చూస్తున్న ప్రతి యువతీయువకుడికి నేను చెప్పేది ఒక్కటే, మన జీవితం అనేది మనం మొదట్లో కనే చిన్న కలల కంటే చాలా పెద్దదిగా మారగలదు అనడానికి విజయ్ గారే ఒక గొప్ప నిదర్శనం' అంటూ తెలిపారు. ప్రస్తుతం సామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Updated Date - Jun 17 , 2026 | 09:51 PM