రవి మోహన్ విడాకుల వివాదం.. కోర్టుకు రాకపోతే కేసు ముగిస్తాం

ABN , Publish Date - Nov 29 , 2026 | 01:20 PM

రవి మోహన్ భార్య ఆర్తి దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Ravi Mohan

ప్రముఖ హీరో రవి మోహన్ ( Ravi Mohan) సతీమణి ఆర్తి (Aarti Ravi) దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో ప్రముఖ గాయని కెనీషా ఫ్రాన్సిస్ (Kenishaa Francis) కు మద్రాస్ హైకోర్టు (Madras High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా డిసెంబరు 3న కోర్టుకు హాజరు కావాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. గాయని కెనీషాతో హీరో రవి మోహన్ సన్నిహితంగా మెలగడంతో రవి ఆర్తి దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో విడాకుల కోసం ఆ దంపతులు మద్రాస్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా, ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.

ఈ నేపథ్యంలో తన పరువు ప్రతిష్ట లకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు, సోషల్ మీడియాలో చేసిన అసత్య పోస్టులను తక్షణం తొలగించాలని లేదంటే పరువు నష్టం చెల్లించాలని కోరుతూ కెనీషాకు వ్యతిరేకంగా ఆర్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. డిసెంబరు 3న స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. ఒక వేళ ఆ రోజున కోర్టుకు హాజరుకాని పక్షంలో ఈ కేసుకు అదే రోజు ముగింపు పలుకుతామని హైకోర్టు స్పష్టం చేసింది.

Updated Date - Nov 29 , 2026 | 01:58 PM