175వ సినిమా తర్వాత రజనీకాంత్ రిటైర్మెంట్.. బాబోయ్ ఈ వార్తలేంటి?
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:22 AM
దశాబ్దాలుగా కోలీవుడ్‌ను తన అద్వితీయమైన మేనరిజమ్స్, స్టైల్‌తో ఏలుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. నిజంగా ఇది నిజమైతే మాత్రం.. ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదు.
తమిళ చిత్ర పరిశ్రమతో పాటు యావత్ భారత సినీ రంగంలో ఇప్పుడు ఒక వార్త తీవ్ర సంచలనం రేపుతోంది. దశాబ్దాలుగా కోలీవుడ్‌ను తన అద్వితీయమైన మేనరిజమ్స్, స్టైల్‌తో ఏలుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న తాజా సమాచారం ప్రకారం.. రజనీకాంత్ తన 175వ ప్రాజెక్ట్ పూర్తి చేసిన తర్వాత శాశ్వతంగా నటనకు గుడ్‌బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
ఇప్పటికే కోలీవుడ్ అగ్ర హీరో దళపతి విజయ్ తన రాజకీయ ప్రయాణం కోసం సినిమాలకు పూర్తిగా దూరం కానున్నట్లు ప్రకటించి, తన చివరి చిత్రం ఇదేనని ‘జననాయగన్’కు ప్రకటించారు. ఇప్పుడు విజయ్ బాటలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా 175 (Rajini175)వ మైలురాయి చిత్రాన్ని ముగించి రిటైర్ అవుతారనే వార్త రావడం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒకేసారి ఇద్దరు భారీ మాస్ పల్స్ ఉన్న స్టార్ హీరోలు ఇండస్ట్రీకి దూరం కానుండటంతో, సోషల్ మీడియాలో ‘ఎండ్ ఆఫ్ కోలీవుడ్ సూపర్ స్టార్స్ ఎరా’ అంటూ నెటిజన్లు ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారు.
అయితే, రజనీకాంత్ రిటైర్మెంట్‌పై ఇలాంటి రూమర్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ‘బాబా, కాళా, కూలీ’ సినిమాల సమయంలోనూ ఆయన సినిమాలకు స్వస్తి చెప్తారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ 175వ సినిమా గురించిన వార్తలపై అటు రజనీకాంత్ టీమ్ గానీ, ఇటు ఇండస్ట్రీ అధికారిక వర్గాలు గానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే ఈ వార్త కేవలం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఒక బజ్ మాత్రమే. రజనీకాంత్ సినిమాల్లో కొనసాగుతారా లేదా అనేది ఆయన స్వయంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం రజనీకాంత్ తన 173వ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు ఇటీవలే ‘ధర్మన్’ అనే టైటిల్‌ను ప్రకటించారు. మరోవైపు ‘జైలర్ 2’ సినిమా పూర్తై, విడుదలకు సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి:
బాడీ డబుల్ లేకుండా 20 గంటల పాటు ఫైట్.. రష్మిక రేర్ రికార్డ్
ధనుష్ ‘ఓమ్’లో బాలీవుడ్ దిగ్గజం.. క్రేజీ అప్డేట్
ఇది చాలు సార్.. కన్నీళ్లు తెప్పిస్తోన్న నిరంజన్ తండ్రి మాటలు