మొన్న టాక్సిక్.. నేడు ధర్మన్.. ఏమవుతుందో

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:16 PM

ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ట్రెండ్స్ మారిపోతూ ఉంటాయి. ఒకరిని చూసి మరొకరు ఆ ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఆ ట్రెండ్ కొందరికీ విజయాలను ఇస్తే మరికొందరికి పరాజయాలను అందిస్తుంది.

Dharmaan

ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ట్రెండ్స్ మారిపోతూ ఉంటాయి. ఒకరిని చూసి మరొకరు ఆ ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఆ ట్రెండ్ కొందరికీ విజయాలను ఇస్తే మరికొందరికి పరాజయాలను అందిస్తుంది. ఒకప్పుడు ఒక సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను చూడడం అనేది పెద్ద అద్భుతం. కానీ, ఇప్పుడు ఒక్క స్టార్ హీరో సినిమాలో నలుగురు స్టార్ హీరోలు క్యామియోలుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ కూడా సాధారణం అయ్యిపోయింది. కొత్తగా స్టార్ హీరోల ప్లేస్ లో హీరోయిన్లు వచ్చి చేరుతున్నారు. ఒక్క హీరో.. నలుగురు హీరోయిన్లు. కేవలం హీరోతో రొమాన్స్ అనేలా కాకుండా అక్కగా.. విలన్ గా.. ప్రతి పాత్రలో హీరోయిన్స్ ఒదిగిపోతున్నారు.


టాక్సిక్ సినిమా ఈ కొత్త ట్రెండ్‌కు తెరలేపింది. ఈ చిత్రంలో నయనతార, కియరా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి వారు కనిపించగా, ఇప్పుడు అదే బాటలో మరికొన్ని భారీ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. అందులో ఒకటి ధర్మన్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాని కమల్ హాసన్ నిర్మిస్తోన్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్రంలో సిమ్రాన్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారని అధికారికంగా మేకర్స్ తెలిపారు. ఆ తరువాత శ్రీలీల, రుక్మిణి వసంత్ కూడా భాగమయ్యారనే ప్రచారం జరిగింది. ఇదంతా ఒకెత్తైతే, తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి స్టార్ హీరోయిన్ నయనతార ఎంట్రీ ఇస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం నయనతారను సంప్రదించగా, ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


ఇక రజనీకాంత్ - నయనతార కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఇప్పటివరకు చంద్రముఖి, కుశేలన్ (కథానాయకుడు), అన్నత్తే (పెద్దన్న), దర్బార్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ధర్మన్ లో కనుక నయన్ ఉంటే.. వీరిద్దరికీ ఇది ఐదవ సినిమా అవుతుంది. రజనీకాంత్ సరసన నయన్ మరోసారి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. జైలర్ 2 వంటి సంచలన విజయాల తర్వాత తలైవర్ నుంచి వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరోసారి రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Oct 18 , 2026 | 05:21 PM