జైలర్ 2 అయ్యింది.. ఇప్పుడు నరసింహా 2
ABN , Publish Date - Oct 21 , 2026 | 08:51 PM
దక్షిణాది సినీ ప్రియులకు నరసింహా సినిమా ఒక మరుపురాని అనుభూతి. 1999లో వచ్చిన ఈ సినిమా సృష్టించిన బాక్సాఫీస్ సునామీ, రమ్యకృష్ణ నీలాంబరిగా, రజనీకాంత్ నరసింహాగా చేసే మాస్ హంగామా ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో తాజాగానే ఉన్నాయి.
దక్షిణాది సినీ ప్రియులకు నరసింహా సినిమా ఒక మరుపురాని అనుభూతి. 1999లో వచ్చిన ఈ సినిమా సృష్టించిన బాక్సాఫీస్ సునామీ, రమ్యకృష్ణ నీలాంబరిగా, రజనీకాంత్ నరసింహాగా చేసే మాస్ హంగామా ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో తాజాగానే ఉన్నాయి. అయితే, గత కొంతకాలంగా ఈ క్లాసిక్ సినిమాకు సీక్వెల్ రాబోతోందంటూ వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి వెలువడుతున్న కథనాలు మళ్లీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
దర్శకుడు కేఎస్ రవికుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. 'గతంలోనే నరసింహా 2 కోసం కథా చర్చలు జరిగాయి. ముఖ్యంగా మొదటి భాగంలో చనిపోయిన నీలాంబరి పాత్ర మళ్లీ పునర్జన్మ ఎత్తి నరసింహపై పగ తీర్చుకునే డ్రామాతో ఒక ఐడియాను, అలాగే మరో కొత్త లైన్‌ను సిద్ధం చేసి రజనీకాంత్‌కు కూడా వినిపించాను. ఆ సమయంలో రజనీ కూడా ఆసక్తి చూపినప్పటికీ, ఇటీవల నరసింహా సినిమా రీ-రిలీజ్‌లో పొందిన గ్రాండ్ రెస్పాన్స్ చూసిన తర్వాత లెక్కలు మారాయి. రీ-రిలీజ్‌లోనే బాక్సాఫీస్ కలెక్షన్లు ఊహించని రేంజ్‌లో రావడంతో, సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు అంబరాన్ని తాకుతాయని రజనీ గ్రహించారు. అందుకే పాత మోడల్ కథనం సరిపోదని, నేటి తరం మేకింగ్‌కి సరిపోయేలా మరింత బలమైన స్క్రీన్‌ప్లే సిద్ధం చేయాలని సూచించారు. త్వరలోనే ఈ సీక్వెల్ ముందుకు కదలొచ్చని ఆయన తెలిపారు.
ఇప్పటికే రజనీ.. జైలర్ 2 సీక్వెల్ తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు నరసింహా 2 సీక్వెల్ వస్తే వేరే లెవెల్ ఉంటుందని అనుకున్నా కూడా అభిమానుల్లో మాత్రం ఒక రకమైన అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్లుగా ఔట్ డేటెడ్ కాకుండా కథను ఎలా మలుస్తారు? కేఎస్ రవికుమార్ మార్క్ మేకింగ్ ఇప్పటి ట్రెండ్‌కి సెట్ అవుతుందా? అని రజనీ ఫ్యాన్స్ విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం రజనీ ధర్మన్ తో బిజీగా ఉన్నారు. దీని తరువాత కమల్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఇవన్నీ పూర్తి అయ్యాక కానీ, ఈ సీక్వెల్ గురించి రజనీ ఆలోచించరు అని తెలుస్తోంది. మరి రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తారో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.