‘కూలీ’ షాక్‌తో ‘జైలర్ 2’కు తలైవా కండీషన్.. ఏంటో తెలుసా?

ABN , Publish Date - Sep 14 , 2026 | 10:31 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ - నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఇండస్ట్రీ హిట్ ‘జైలర్’. ప్రస్తుతం ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోంది.

Rajinikanth in Jailer 2

సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) - నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) కాంబోలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఇండస్ట్రీ హిట్ ‘జైలర్’ (Jailer). ప్రస్తుతం ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ (Jailer 2) భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఏకంగా రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ స్పెక్టాకిల్‌ను నిర్మిస్తోంది. ఇందులో రజనీకాంత్ పారితోషికం వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ సీక్వెల్ కోసం తలైవా ఏకంగా రూ. 125 కోట్ల భారీ రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకోనున్నట్లు సమాచారం. ఈ సినిమాతో ఏకంగా రూ. 600 కోట్ల ప్రీ-రిలీజ్, థియేట్రికల్ బిజినెస్‌ను టార్గెట్ చేసిన నిర్మాతలు.. కనీసం రూ. 250 కోట్లకు పైగా నికర లాభాన్ని ఆశిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.


చిత్ర నిర్మాణం కూడా కనీవినీ ఎరుగని స్కేల్‌లో జరుగుతోంది. ప్రతిరోజూ దాదాపు 500 నుంచి 600 మంది సాంకేతిక నిపుణులు, సిబ్బంది ఈ సినిమా సెట్స్‌పై పనిచేస్తున్నారు. ఇటీవల గోవా షెడ్యూల్‌కు సంబంధించిన ప్యాచ్‌వర్క్ చిత్రీకరణను ఆదిత్య రామ్ స్టూడియోస్‌లో నిర్వహించగా, ఆ ఒక్క సీక్వెన్స్ కోసమే 600 మంది పనిచేశారని, సెట్స్‌పై ఏకంగా 51 కారవాన్లు మోహరించాయని తెలిసి ఇండస్ట్రీ ఆశ్చర్యపోతోంది. అయితే, మొదటి భాగం కంటే ‘జైలర్ 2’లో వయొలెన్స్ డోస్ ఇంకా భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు సమాచారం లీక్ కావడంతో దర్శకుడు నెల్సన్‌కు రజనీకాంత్ ఓ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.


సినిమాకు ఎట్టిపరిస్థితుల్లోనూ ‘A’ సర్టిఫికెట్ రాకుండా చూడాలని, వీలైనంత వరకు మితిమీరిన రక్తపాతం తగ్గించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు అనుకూలంగా ‘UబైA’ సర్టిఫికెట్ వచ్చేలా డిజైన్ చేయాలని రజనీ స్పష్టంగా కోరారట. గతంలో వచ్చిన ‘కూలీ’ (Coolie) చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ రావడంతో పిల్లలు, కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రాలేకపోయారని రజనీ చాలా ఫీలయ్యారట. అందుకే ‘జైలర్ 2’ను మాస్ ప్రేక్షకులతో పాటు చిన్నపిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసేలా తీర్చిదిద్దాలని తలైవా గట్టిగా పట్టుబట్టడంతో మేకర్స్ ఆ దిశగా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. సో.. భారీ బడ్జెట్, తలైవా మార్క్ మేనియాతో రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి!

ఇవి కూడా చదవండి:

రాజమౌళి సినిమాలో నటిస్తూనే.. 9 చిత్రాలు పూర్తి చేసిన హీరో!

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య చేసే రోల్ ఇదేనా?

చిన్ని ప్రాణానికి ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. సమంత సీమంతం పోస్ట్ వైరల్

Updated Date - Sep 14 , 2026 | 10:45 PM