ఐదు భాషల్లో ‘వారాహి అమ్మన్'
ABN , Publish Date - Nov 17 , 2026 | 09:56 AM
ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారాహి అమ్మవారి మహిమ, కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఓ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది.
వీకేవీ పిక్చర్స్, స్టెల్లార్ క్రాఫ్ట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించే చిత్రానికి 'వారాహి అమ్మన్ (Vaarahi Amman) అనే టైటిల్ ఖరారు చేశారు. ఐదు భాషల్లో రూపొందించనున్న ఈ చిత్రానికి నవీన్ గణేష్ (Nawin Ghanesh) దర్శకుడు. వారాహి అమ్మవారి మహిమ, కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందించే ఈ చిత్రానికి నిర్మాతలు డాక్టర్ వడివేలన్ పీజే, చంద్రశేఖరన్ వీఎం. సెల్లార్క్రాఫ్ట్ స్టూడియోస్ బాలసుబ్రహ్మణ్యం, బాలాజీ కన్నియప్పన్ సహ నిర్మాతలు.
ఈ చిత్ర వివరాలను దర్శక నిర్మాతలు వివరిస్తూ, 'భక్తి వైభవం కలగలసిన చిత్రంగా రూపొందిస్తున్నాం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వీఎఫ్ఎక్స్, ఏఐ టెక్నాలజీ సీక్వెన్స్‌ను చెన్నైకు చెందిన యూఎస్ ఆధారిత సంస్థ బిక్సర్ స్టూడియోస్‌కు అప్పగించాం. అంతర్జాతీయ స్థాయి విజువల్స్ తో అభిమానులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతినందించేలా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో నటించే నటీనటులు, పనిచేసే సాంకేతిక నిపుణలు ఎంపిక సాగుతోంది' అని చిత్ర బృందం తెలిపింది.