Jailer 2: బిందాస్.. నోరా.. తమన్నాని బీట్ చేయలేకపోయిందిరా

ABN , Publish Date - Sep 30 , 2026 | 09:30 PM

సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ జైలర్ 2. మూడేళ్ళ క్రితం రిలీజ్ అయిన జైలర్ కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది.

Jailer 2

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), దర్శకుడు నెల్సన్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ జైలర్ 2 (Jailer 2). మూడేళ్ళ క్రితం రిలీజ్ అయిన జైలర్ కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక మొదటి పార్ట్ ని మించి రెండో పార్ట్ ను తెరకెక్కించాడు నెల్సన్. ఈసారి కూడా సెలబ్రిటీ క్యామియోలకు ఏ మాత్రం కొదువ లేదు. మలయాళ హీరో సూరజ్ వెంజూరమూడు, ఎస్ జె సూర్య, విద్యా బాలన్, మిథున్ చక్రబోర్తి లాంటి స్టార్స్ ని దింపాడు నెల్సన్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


రజనీ సినిమా అంటే అనిరుధ్ మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెల్సిందే. జైలర్ సినిమా కేవలం అనిరుధ్ మ్యూజిక్ వలనే అంతా హిట్ అయ్యింది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అయితే జైలర్ 2 కి అనిరుధ్ అంతా మ్యాజిక్ చేయలేకపోయాడని టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు జైలర్ 2 నుంచి నాలుగు పాటలు రిలీజ్ అయ్యాయి. ఏ ఒక్క పాట అనుకున్నంత హైప్ కి రీచ్ కాలేదు. తాజాగా జైలర్ 2 నుంచి బిందాస్ అంటూ సాగే ఒక ఐటెమ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి ఈ సాంగ్ లో తన అందాలతో అదరగొట్టేసింది.


ఇక ఈ పాటపై ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. జైలర్ మొదటి భాగంలో తమన్నా భాటియా నటించిన నువ్వు కావాలయ్యా పాట ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అనిరుధ్ అందించిన మాస్ బీట్స్, తమన్నా గ్లామర్ అండ్ డాన్స్ మూవ్స్ యూట్యూబ్‌ను షేక్ చేశాయి. అయితే బిందాస్ పాటలో ఆ స్థాయి మ్యాజిక్ ఏమాత్రం కనిపించడం లేదని సంగీతాభిమానులు అభిప్రాయపడుతున్నారు.


ముఖ్యంగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈసారి చాలా చప్పని మ్యూజిక్ ఇచ్చాడని, ఆయన మార్క్ జోష్ ఇందులో మిస్ అయ్యిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక తమన్నా క్యూట్ అండ్ సెన్సేషనల్ గ్లామర్‌‌ను నోరా ఫతేహి ఏమాత్రం బీట్ చేయలేకపోయిందని, పాట ఎంత రంగులకలగా ఉన్నా నువ్వు కావాలయ్యా రేంజ్ చార్ట్‌బస్టర్ వైబ్స్ మాత్రం రావడం లేదని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 15 న రిలీజ్ కానుంది. మరి ఈ సీక్వెల్ తో నెల్సన్- రజనీ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Updated Date - Sep 30 , 2026 | 09:30 PM