సూర్య.. కొంచెం గ్యాప్ ఇవ్వవయ్యా

ABN , Publish Date - Oct 30 , 2026 | 10:56 AM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ఈ ఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కరుప్పు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న సూర్య లైనప్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తోంది.

Suriya

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ఈ ఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కరుప్పు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న సూర్య లైనప్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తోంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టిఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. ఇప్పటికే జీతూ మాధవన్ దర్శకత్వంలో సీన్ మూవీ నవంబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకోపక్క టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తన 48వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తరువాత మరో మూడు ప్రాజెక్టులకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.


సూర్య తన 49వ చిత్రం కోసం మండాడి ఫేమ్‌ దర్శకుడు మతిమారన్‌ పుగళేందితో చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పటికే చర్చలు ప్రారంభం కాగా, మతిమారన్‌ చెప్పిన కథ నచ్చడంతో సూర్య సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే, ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్‌.థాను నిర్మాణంలో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశముంది. రూటేడ్ సినిమాలను తెరకెక్కించడంలో మతిమారన్‌ ముందు ఉంటాడు. ఆ నేపధ్యంలోనే సూర్య కథ కూడా ఉందని సమాచారం.


ఇక ఇది కాకుండా తన కెరీర్ మైలురాయి 50 వ చిత్రానికి కూడా సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వరుస ప్లాపులతో సత్యమమవుతోన్న సూర్యని ఆర్జే బాలాజీ.. కరుప్పు స్వామిగా చూపించి భారీ విజయాన్ని అందుకొనేలా చేశాడు. తెలుగులో వీరభద్రుడుగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో తన 50 వ సినిమాగా కరుప్పు సీక్వెల్ చేయబోతున్నాడట సూర్య. ఈ సీక్వెల్ కి కూడా ఆర్జే బాలాజీనే దర్శకత్వం వాహిస్తున్నట్లు సమాచారం. ఇలా వరుస సినిమాల వార్తలు విని ఫ్యాన్స్.. సూర్య, కొంచెం గ్యాప్ ఇవ్వవయ్యా.. ఒకేసారి ఇన్ని సినిమా అప్డేట్స్ అంటే తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాలతో సూర్య ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Updated Date - Oct 30 , 2026 | 10:56 AM