సూర్యకి విలన్ గా గోపీచంద్.. మెంటల్ మాస్ కాంబో
ABN , Publish Date - Nov 17 , 2026 | 08:00 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న విషయం తెల్సిందే. ఒకే ఏడాదిలో మూడు విజయాలను అందుకొని రికార్డు సృష్టించిన సూర్య .. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న విషయం తెల్సిందే. ఒకే ఏడాదిలో మూడు విజయాలను అందుకొని రికార్డు సృష్టించిన సూర్య .. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే ఆయన నటిస్తున్న 48వ చిత్రం.. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుందని టాక్. ఇక దీని తరువాత సూర్య 49 వ చిత్రంపై అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ ఆసక్తిగా మారింది. ఈమధ్యనే మండాడి (Mandaadi) వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు మథిమారన్ పుగళేంది (Mathimaran Pugazhendhi) దర్శకత్వంలో సూర్య 49 వ సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే.
ఈ చిత్రాన్ని కళైపులి ఎస్. థాను నిర్మించనున్నాడు. ఒక భారీ కోస్టల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఇంకా ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాకముందే, ఇందులోని నటీనటుల ఎంపిక కూడా పూర్తయిందంటూ కొన్ని క్రేజీ రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్‌లో అన్నింటికంటే హైలైట్‌గా నిలుస్తున్న అంశం ఏమిటంటే.. ఈ సినిమాలో సూర్యకు పోటీగా పవర్ఫుల్ విలన్ పాత్రలో టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటించనున్నాడనే ప్రచారం ఇండస్ట్రీని షాకింగ్ కి గురిచేస్తోంది. గతంలో జయం, నిజం, వర్షం వంటి చిత్రాల్లో విలన్‌గా మెప్పించిన గోపీచంద్, మళ్ళీ చాలా కాలం తర్వాత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సూర్యతో తలపడనున్నారనే వార్త సినీ అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ను నింపుతోంది.
అయితే ఇది నిజమా.. కాదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమైతే మాత్రం ఇంతకు మించిన మెంటల్ మాస్ కాంబో ఇంకొకటి ఉండదు అని చెప్పాలి. గోపీచంద్ గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో హీరోగా ఒక మంచి హిట్ దక్కించుకోవాలని చాలా ఆరాటపడుతున్నాడు. కథల ఎంపిక బావున్నా కూడా ఆ సినిమాలు ప్రేక్షకులను ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో ఒకటి సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో భరతవర్ష. ఇక ఇది కాకుండా వెంకట్ దర్శకత్వంలో సింగా ఒకటి చేస్తున్నాడు. హీరోగా చేస్తున్న సమయంలోనే సూర్య సినిమాలో విలన్ గా గోపీచంద్ ఒప్పుకున్నాడా.. ? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ, నిజంగా విలన్ గా గోపీచంద్ చేస్తే మాత్రం ఆయనకు మించిన పెద్ద విలన్ ఇంకెవరూ ఉండరు అని, టాలీవుడ్ మొత్తాన్ని ఏలేస్తాడు అని ఫ్యాన్స్ చెప్పుకోస్తున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే అధికారక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.