కోలీవుడ్‌లో నయా ట్రెండ్.. ఇన్ ఫ్లుయెన్సర్లకు ఛాన్సులు

ABN , Publish Date - Nov 05 , 2026 | 10:29 AM

కోలీవుడ్‌లో నటీనటుల ఎంపిక విధానం మారుతోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్లకు తమిళ సినిమాల్లో అవకాశాలు లభిస్తున్నాయి.

Ramya Ranganathan

తమిళ సినిమా కాలానికి అనుగుణంగా మారుతోంది. వాటిలో ఒకటి నటుల ఎంపిక అనేది ముఖ్యమైన మార్పు. సోషల్ మీడియాలో ప్రాచూర్యం పొందిన ఇన్ ఫ్లుయెన్సర్ల (influencers) వైపు కోలీవుడ్ చూస్తోంది. ఇన్ స్టాగ్రామ్ (Instagram Reels) లో రీల్స్ చేస్తూ అధిక సంఖ్యలో ఫాలోయర్స్ కలిగిన వారికి తమిళ సినిమాల్లో నటించే అవకాశం ఎక్కువ‌గా లభిస్తోంది.

ఈ నయా ట్రెండ్ ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. వాస్తవానికి సినిమా రంగం, ఇతర రంగాలతో పోలిస్తే ఇక్కడ పోటీ చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే, గతంలో ఒక సినిమాకు నటీనటులను ఎంపిక చేయాలంటే లెక్కలేనని ఆడిషన్లు, ఫొటోషూట్లు, స్క్రీన్ టెస్టులు, సిఫార్సు లేఖలతో సినిమా రంగంలోకి ఆడుగు పెట్టడం గగనంగా ఉండేది.

సినిమాల నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆ సినిమా రంగం ఎక్కడ ఉందో ఎవరిని సంప్రదించాలో కూడా తెలిసేది కాదు. కానీ, నేడు ఇన్‌స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు తమలోని టాలెంట్‌తో తమ మొబైల్ ఫోన్లతో సినిమా రంగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏదో ఒక మారుమూల పల్లెటూరిలో కూర్చొని ప్రతిభను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలి యజేస్తున్నారు.

అలా సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న వారికి ఇప్పుడు సినిమా పరిశ్రమ స్వాగతం పలుకుతోంది. ఉదాహరణకు డ్యాన్స్ వీడియోలు, రీల్స్ చేసి ఇన్‌స్టాలో ఫేమస్ అయిన రమ్య రంగనాథన్ (Ramya Ranganathan) ఓ దర్శకుడి దృష్టిని ఆకర్షించి 'నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం' చిత్రంలో ఏకంగా హీరోయిన్ అవకాశాన్ని దక్కించుకుంది. ఇపుడు ఆమెకు అనేక చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. అలాగే, వీజే సిద్ధూ (VJ Siddhu), హర్షద్ ఖాన్ వంటివారు సినీ ఛాన్సులు పొందారు. 'పరితాపం గల్' య్యూట్యూబ్ వీడియోలతో మంచి గుర్తింపు పొందిన గోపి (Gopi)డ్యూడ్ (Dude Movie) హీరో ప్రదీప్ రంగనాథన్ స్నేహితుడిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించారు.

అలా చాలా మంది వర్ధమాన నటీనటులు ఇన్‌స్టా, యూట్యూబ్ ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెడు తున్నారు. గతంలో ఉన్నట్టుగా సినిమా రంగంలో అవకాశాల కోసం ఎదురు చూసే రోజులు పోయాయి. ఇపుడు తమలోని టాలెంట్‌ను రీల్స్, వీడియోల ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తేనే సినిమా అవకాశాలు లభించే విధంగా కోలీవుడ్‌లో ట్రెండ్ కొనసాగుతోంది. అలాగే, కొత్త సినిమాల ప్రచారానికి కూడా నిర్మాతలు సైతం ఇన్ ఫ్లుయెన్సర్లపైనే ఆధారపడుతుండటం ఆసక్తికరంగా మారింది.

Updated Date - Nov 05 , 2026 | 10:39 AM