గాంధీ జయంతికి వివాదాస్పద చిత్రం 'డోరతీ'
ABN , Publish Date - Sep 26 , 2026 | 03:32 PM
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కీర్తి సురేశ్ టైటిల్ రోల్ ప్లే చేసిన 'డోరతి' సినిమా కథాంశం కారణంగా వివాదాస్పదమైంది. ఆ సినిమాను అక్టోబర్ 2న రానా దగ్గుబాటి తెలుగులో విడుదల చేస్తున్నారు.
కార్తీక్ సుబ్బరాజ్‌కు దర్శకుడిగా మంచి పేరుంది. విభిన్నమైన జానర్స్‌ను తెరకెక్కించి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నిర్మాతగానూ అర్థవంతమైన చిత్రాలను నిర్మిస్తాడని చిత్రసీమ అతన్ని ఆకాశానికి ఎత్తుతుంటుంది. తాజాగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన 'డోరతీ' చిత్రం మాత్రం వివాదాలకు నెలవైంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాను మలేసియాలో నిషేధించారనే ప్రచారం జరుగుతోంది. ట్రైలర్‌లో ఈ సినిమా కథాంశం పూర్తి స్థాయిలో రివీల్ కాకుండా కార్తీక్ సుబ్బరాజు జాగ్రత్త పడ్డాడు. కీర్తి సురేశ్, సనంత్, రిషికాంత్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. సినిమా ప్రథమార్థం తమిళనాడు గ్రామీణ నేపధ్యంలో సాగినా ద్వితీయార్థంకు వచ్చే సరికీ కార్తీక్ సుబ్బరాజు తను చూపించాలనుకున్న అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చాడు. అదే స్వలింగ సంపర్కం. దానికి అలవాటు పడిన ఓ వ్యక్తి లింగ మార్పిడి చేసుకోవడంతో ఈ కథాంశం వివాదాస్పదమైంది. ఈ రకమైన ముగింపు ఊహించని జనాలు థియేటర్ కు వెళ్ళి షాక్ కు గురి అవుతున్నారు.
ఎల్.జి.బి.టి. అంశాలకు ప్రాధాన్యమిస్తూ, వారి సమస్యలను హైలైట్ చేస్తూ ఇటీవల తెలుగులో సునీల్ కుమార్ రెడ్డి 'ఎల్.జి.బి.టి.: ద లీగల్ బ్యాటిల్' అనే సినిమాను తెరకెక్కించారు. విమర్శకుల ప్రశంసలు పొందినా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. ఇదే తరహా వివాదాస్పద అంశంతో తెరకెక్కిన తమిళ చిత్రం 'డోరతీ'ని ఇప్పుడు తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు. రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా సంస్థ అక్టోబర్ 2వ తేదీ, గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో విడుదల చేయబోతోంది.
గురువారం విడుదలైన 'ది ప్యారడైజ్' మూవీతో కీర్తి సురేశ్ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది, ఆ మర్నాడే ఆమె టైటిల్ రోల్ ప్లే చేసిన 'డోరతి' తమిళంలో విడుదలైంది. అలానే ఇప్పుడీ సినిమా తెలుగులోనూ రాబోతోంది. తొలిసారి సోలో హీరోగా 'మొద రాత్రి' చిత్రంలో నటించిన రిషి కాంత్ 'డోరతి'లో ఇద్దరు హీరోలలో ఒకడిగా నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన 'మొద రాత్రి' సినిమా ఆగస్ట్ 21న విడుదలై తమిళనాడులో మంచి విజయాన్ని అందుకుంది. ఇదే యేడాది ఫిబ్రవరిలో వచ్చిన 'కపుల్ ఫ్రెండ్లీ'లోనూ హీరోయిన్ లవర్ గా ఓ చిన్న పాత్రను రిషికాంత్ పోషించాడు. దాదాపు ఒకటిన్నర దశాబ్దంగా తమిళ చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తున్న రిషికాంత్ మొన్న 'మొద రాత్రి', ఇప్పుడు 'డోరతీ' చిత్రాలలోని నటనతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయాడు. మరి 'డోరతీ' మూవీకి తెలుగులో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
Divyabharathi: ఒరేయ్.. బికినీ ఫోటోలు నిజమనుకున్నారు కదరా..
నానికే ఈ రేంజ్ లో ఉంటే.. దేవరకొండ పరిస్థితి ఏంటో
ప్యారడైజ్ ఎఫెక్ట్.. ఆగిపోయిన చిరు- శ్రీకాంత్ ఓదెల సినిమా