బలవంతపు పెళ్లి.. హత్యకేసులో భర్త.. సావిత్రి ఏం చేస్తోంది

ABN , Publish Date - Nov 12 , 2026 | 09:48 PM

నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సత్యవాన్ సావిత్రి (Sathyavan Savithiri). విలక్షణమైన సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిస్కిన్ (Mysskin) ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Sathyavan Savithiri

నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సత్యవాన్ సావిత్రి (Sathyavan Savithiri). విలక్షణమైన సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిస్కిన్ (Mysskin) ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాకి ప్రవీణ్ ఎస్ విజయ్ (Praveen S Vijaay) దర్శకత్వం వహించగా.. డ్రమ్‌స్ట్రిక్స్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.


ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సావిత్రి(కీర్తి సురేష్) కి చిన్నప్పటి నుంచి లాయర్ అవ్వాలనే కల. దానికోసం కోర్టులో జూనియర్ లాయర్ గా పనిచేస్తూ ఉంటుంది. అయితే సావిత్రి పేరెంట్స్ తనకు ఇష్టం లేకపోయినా దీపక్(చారుకేశ్) తో పెళ్లి జరిపిస్తారు. పెళ్లి చూపులు అప్పుడు తనకు పెళ్లి ఇష్టం లేదు అని చెప్పినా పెళ్లి చేసుకున్నాడు అని దీపక్ పై కోపంతో ఉంటుంది సావిత్రి. అయితే తన మనసు మారేవరకు ప్రేమిస్తూనే ఉంటాను అని దీపక్ చెప్పడం, నెమ్మదిగా సావిత్రి కూడా అతడిపై ప్రేమను పెంచుకోవడం జరుగుతుంది. ఇదే సమయంలో చెన్నైలో వెరోనికా అనే మహిళ హత్యకు గురికావడం, ఆ కేసులో దీపక్ బలిపశువు కావడం, ఆ కేసును సీనియర్ లాయర్ మిస్కిన్ వాదించడం చూపించారు. మరి సావిత్రి అతనిని రక్షించడానికి ఏం చేసింది.. ? తన భర్త నిరపరాధి అని రుజువు చేసిందా.. ? అసలు ఆ హత్య చేసింది ఎవరు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


కీర్తి సురేష్ కి లాయర్ గా చేయడం ఇదేమి కొత్త కాదు. కానీ, ఈసారి కొద్దిగా కామెడీని మిక్స్ చేయడంతో ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. సస్పెన్స్, డార్క్ థ్రిల్లర్ ఎలిమెంట్స్, కోర్ట్ రూమ్ డ్రామా అంశాలతో ఈ ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. కీర్తి సురేష్ నటన ఈ సినిమాకు ప్రధాన హైలైట్ నిలవనుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ట్రైలర్ తో సినిమాపై హైప్ పెంచేశారు మేకర్స్. నవంబర్ 20 న సత్యవాన్ సావిత్రి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో కీర్తి సురేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Nov 12 , 2026 | 09:56 PM