Dorothy: ఇద్దరి మగాళ్ల మధ్య ఇంటిమేటెడ్ సీన్స్.. ఏం దిక్కుమాలిన కథరా బాబు
ABN , Publish Date - Sep 25 , 2026 | 07:14 PM
టాలీవుడ్ లో గుర్తింపు కథలు ఎక్కువ వస్తున్నట్లు.. కోలీవుడ్ లో స్వలింగ సంపర్కాన్ని చూపించే కథలు ఎక్కువ వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ప్యారడైజ్ టాక్ గురించి డిబేట్ లు పెట్టడం వలన తమిళ్ ఇండస్ట్రీలో వచ్చిన ఒక సినిమా గురించి మర్చిపోయారు.
టాలీవుడ్ లో గుర్తింపు కథలు ఎక్కువ వస్తున్నట్లు.. కోలీవుడ్ లో స్వలింగ సంపర్కాన్ని చూపించే కథలు ఎక్కువ వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ప్యారడైజ్ టాక్ గురించి డిబేట్ లు పెట్టడం వలన తమిళ్ ఇండస్ట్రీలో వచ్చిన ఒక సినిమా గురించి మర్చిపోయారు. అదే డోరోతి (Dorothy). జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్, సనంత్, ఈ మధ్య రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న మోద రాత్రి ఫేమ్ రిషికాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు 'పేట' ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ లో కానీ, ట్రైలర్ లో కానీ.. ఇలాంటి ఒక కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నామని తెలియకుండా జాగ్రత్త పడ్డారు. సెప్టెంబర్ 25 న డోరోతి రిలీజ్ అయ్యి నెగిటివ్ రివ్యూస్ ని అందుకుంటుంది.
1990ల నాటి గ్రామీణ తమిళనాడు నేపథ్యంతో, కుల వివక్ష, హింస, పురుషాధిక్య భావజాల వంటి అంశాల చుట్టూ ఈ కథ సాగుతుంది. సినిమా ప్రథమార్ధం ఒక చక్కని విలేజ్ డ్రామాగా, గ్రామీణ వాతావరణం, అక్కడి మనుషుల సంబంధాలు, కుల రాజకీయాల చుట్టూ చాలా ఆసక్తికరంగా సాగుతుందట. అయితే ద్వితీయార్థంలో కథ పూర్తిగా ఊహించని మలుపు తిరుగుతుందని ఊరిలోని పరిస్థితుల వల్ల పాత్రలు రోడ్డు పైకి రావడంతో ఇది ఒక రోడ్ మూవీగా మారి చివర్లో ఈ కథలోకి LGBTQ+, ఐడెంటిటీ థీమ్‌లు ఉంటాయని.. ఇద్దరు మగాళ్లు ప్రేమించుకోవడం.. వారిమధ్య ఇంటిమేటెడ్ సీన్స్ ని కూడా డైరెక్టర్ చూపించినట్లు తమిళ తంబీలు చెప్పుకొస్తున్నారు.
అంతేకాకుండా ఈ సినిమాను బ్యాన్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ చిత్రం క్లైమాక్స్ లో ఒక హీరో ట్రాన్స్ జెండర్ గా మారి.. మరొక హీరోని పెళ్లి చేసుకునే సీన్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ సినిమా తరువాత కార్తీక్ సుబ్బరాజ్ లాంటి మాస్ అండ్ కల్ట్ డైరెక్టర్ నుంచి ఇలాంటి ఒక కాన్సెప్ట్ రావడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. LGBTQ+ అంశాల గురించి మాట్లాడటం, అవగాహన కల్పించడం మంచిదే, కానీ ఇలాంటి ఆలోచనలను బలవంతంగా ప్రేక్షకులపై రుద్దడం ఎంతవరకు సమంజసం? ఇది ఏమాత్రం సరైన దిశ కాదు అని కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ నుంచి మేము ఇలాంటి సినిమాను అస్సలు ఊహించలేదని సోషల్ మీడియా కామెంట్లు పెడుతున్నారు.
అయితే మరికొందరు మాత్రం దర్శకుడి ధైర్యాన్ని అభినందిస్తున్నారు. కుల వ్యవస్థను, సమాజంలోని మూస ధోరణులను ప్రశ్నిస్తూనే, సున్నితమైన అంశాన్ని ప్రధాన స్రవంతి సినిమాలో చూపించడానికి ప్రయత్నించారని మద్దతుగా నిలుస్తున్నారు. కీర్తి సురేష్ తో పాటు సనంత్, రిషికాంత్ తమ పాత్రలకు ప్రాణం పోశారని, కథలోని టోన్ మారినప్పటికీ నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమాను నిలబెట్టిందని చెప్తున్నారు. ఏది ఏమైనా డోరోతి సినిమా కోలీవుడ్‌లోనే కాక నెట్టింట తీవ్రమైన చర్చలకు వేదికగా మారింది. ఇక ఈ కథ విన్న కొందరు ఏం దిక్కుమాలిన కథలురా ఇవి.. తెలుగులో ఇంకా ఈ సినిమా రిలీజ్ కాలేదు.. ఇక్కడ రిలీజ్ చేస్తే ప్రేక్షకులు బ్యాన్ చేసేవరకు వదిలిపెట్టరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.