కార్తీక దీపోత్సవ వేళ.. అరుణాచలేశ్వరుడి సేవలో ఇళయరాజా

ABN , Publish Date - Nov 26 , 2026 | 07:49 AM

కార్తీక దీపోత్సవాల సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుడి ఆలయాన్ని సందర్శించి అన్నామలైయార్ స్వామిని దర్శించుకున్నారు.

Ilaiyaraaja

కార్తీక దీపోత్సవాల ( Karthigai Deepam) వేళ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) తమిళనాడులోని తిరువణ్ణామలైలో కొలువైన అరుణాచలేశ్వరుడిని (Arunachaleswarar Temple) దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బుధవారం ఉదయం ఆయన తిరువణ్ణామలై ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఇళయరాజాకు ఘన స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం మర్యాదలు చేసి సత్కరించారు.

అనంతరం ఇళయరాజా ఉన్నాములై అమ్మవారితో కొలువైన అన్నామలైయార్ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. దర్శనం అనంతరం ఆలయ నిర్వాహకులు (Tiruvannamalai Temple) ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్తీక దీపోత్సవాల నేపథ్యంలో ఇళయరాజా ఆలయాన్ని సందర్శించడం విశేషంగా నిలిచింది.

Updated Date - Nov 26 , 2026 | 07:53 AM