బ్లైండ్ పోలీస్‌గా సూర్య.. నిజమేనా

ABN , Publish Date - Oct 25 , 2026 | 10:01 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు వరుస హిట్లతో మంచి జోష్‌లో ఉన్న సూర్య అదే ఊపులో తన మూడో సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమవుతున్నాడు.

Scene

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు వరుస హిట్లతో మంచి జోష్‌లో ఉన్న సూర్య అదే ఊపులో తన మూడో సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమవుతున్నాడు. మలయాళంలో రోమాంచం, ఆవేశం వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తోన్న చిత్రం సీన్ (Scene). సూర్య, జ్యోతిక దంపతులు తమ సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నెస్లేన్, నజ్రియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


ఇప్పటికే సీన్ నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈశ్వరన్ అనే విలన్ పాత్రలో నెస్లేన్ కనిపించడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి.ఈ సినిమాలో సూర్య ఒక బ్లైండ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం సాగింది. అయితే, దీనిపై చిత్ర బృందం స్పందిస్తూ సూర్య అంధుడిగా నటించడం లేదని, కాకపోతే ఒక ప్రత్యేకమైన కేస్ ఇన్వెస్టిగేషన్ కోసం విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న ఒక విచిత్రమైన టీమ్‌ను ఏర్పరచుకుని క్రైమ్ మిస్టరీని ఛేదించే ఒక డిఫరెంట్ ఎక్స్-పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని క్లారిటీ ఇచ్చారు. విభిన్నమైన శైలితో సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మలయాళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ సుశిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నాడు.


తమిళంలో మంచి అంచనాలు ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి సంబంధించి బజ్ ఇంకా పికప్ కాలేదనే చెప్పాలి. ఇప్పటివరకు విడుదలైన టీజర్, పాటలు టాలీవుడ్ ప్రేక్షకులలో అనుకున్న స్థాయిలో యునానిమస్ పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేయలేకపోయాయి. సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండటంతో, తెలుగులో ఈ సినిమాను గ్రాండ్‌గా ప్రమోట్ చేసి హైప్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నవంబర్ 6 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇంత తక్కువ గ్యాప్‌లో తెలుగు మేకర్స్ ఎలాంటి సాలిడ్ ప్రమోషనల్ ప్లాన్స్‌తో ముందుకు వస్తారో వేచి చూడాలి.

Updated Date - Oct 25 , 2026 | 10:08 PM