GV Prakash Kumar: రెండు దశాబ్దాలు.. 124 చిత్రాలు

ABN , Publish Date - Nov 19 , 2026 | 05:31 AM

సంగీత దర్శకుడిగా రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనున్న జీవీ ప్రకాష్ కుమార్.. తన కెరీర్, సంగీతంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

GV Prakash Kuma

స్టార్ దర్శకుడు శంకర్ (Shankar) నిర్మాణంలో వసంత బాలన్ (Vasanthabalan) దర్శకత్వంలో భరత్, భావన (Bhavana) నటించిన 'వెయిల్' చిత్రం ద్వారా సంగీత దర్శ కుడిగా జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) పరిచయమయ్యాడు. ఆయన సంగీతం సమకూర్చిన తొలి చిత్రం వెయిల్ (Veil Movie) 2006 డిసెంబరు 8న విడుదలైంది. దీంతో వచ్చే నెలతో ఆయన చిత్రసీమలో 20 వసంతాలు పూర్తి చేసుకోనున్నారు. ఈ విషయంపై జీవీ ప్రకాష్ కుమార్ ఓ ట్వీట్ చేశారు.

'ఇప్పటివరకు నేను అనేక భాషల్లో 124 చిత్రాలకు సంగీతం అందించాను. ఈ యేడాది బాగా కలిసి వచ్చింది. 'యూత్', 'ఇరుముడి', 'విశ్వనాథ్ అండ్ సన్స్', 'మండాడి' వంటి అనేక విజయవంతమైన చిత్రాలకు సంగీతం సమకూర్చాను. ఇపుడు మంచి కథా చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాను.

హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఆకాశంలో ఒక తార‌ సినిమా చూసిన తర్వాత తమిళంలో నేను డిస్ట్రిబ్యూట్ చేయాలని భావిస్తున్నాను. నాకు సంగీతం అంటే అమితమైన ఇష్టం. చాలా మంది వ్యాయామం చేసేటప్పుడు సంగీతం వింటారు, కానీ, నాకు మాత్రం నిశ్శబ్దం ఇష్టం. కారులో ప్రయాణం చేసే సమయంలో ఎం.ఎస్. విశ్వనాథన్, ఇళయరాజా, ఏఆర్ రెహ్మాన్ పాటలు వింటాను.

నేను స్వరపరిచిన మొదటి పాట ఎలా వస్తుందోనని చాలా భయపడ్డాను. ఒక వేళ సినిమా రంగంలోకి రాకపోయి ఉంటే క్రికెటర్ అయ్యే వాడిని, అయితే, 'అన్బుడన్ మహి' అనే చిత్రంలో క్రికెటర్‌గా నటించాను. కంప్యూటర్ కోడింగ్ బాగా వచ్చు. అందువల్ల కంప్యూటర్ ఇంజినీర్ కూడా అయివుండొచ్చు. ఇపుడు సంగీత దర్శకుడితో పాటు సినిమాల్లో హీరోగా కూడా నటిస్తున్నాను' అని వివరించారు.

Updated Date - Nov 19 , 2026 | 06:43 AM