విజయ్ దేవుడు.. త్రిష భక్తురాలు.. అలా మిస్ అయ్యిందా
ABN , Publish Date - May 30 , 2026 | 05:27 PM
ఏ సినిమా అయినా ఏ హీరో చేయాలి అనేది రాసిపెట్టి ఉంటుంది. ఎవరి దగ్గరకు వెళ్ళాల్సిన కథ కొంచెం లేట్ అయినా కూడా వారి దగ్గరకే వెళ్తుంది. ఇండస్ట్రీలో ఒక హీరో దగ్గరకు వెళ్ళిన కథ వేరే హీరో చేయడం సర్వసాధారణం.
ఏ సినిమా అయినా ఏ హీరో చేయాలి అనేది రాసిపెట్టి ఉంటుంది. ఎవరి దగ్గరకు వెళ్ళాల్సిన కథ కొంచెం లేట్ అయినా కూడా వారి దగ్గరకే వెళ్తుంది. ఇండస్ట్రీలో ఒక హీరో దగ్గరకు వెళ్ళిన కథ వేరే హీరో చేయడం సర్వసాధారణం. కరుప్పు (Karuppu) సినిమా కూడా ఈ కోవలోకే వస్తుంది. అవును.. కరుప్పు సినిమా సూర్య (Suriya) కన్నా ముందు దళపతి విజయ్ (Thalapathy Viajy) వద్దకు వెళ్ళింది. ఆయన నో అని చెప్పడంతో దర్శకుడు ఆర్జే బాలాజీ.. ఈ కథను సూర్యకు వినిపించడం, వెంటనే ఆయన ఓకే చెప్పడంతో కరుప్పు రిలీజ్ అయ్యి మంచి కలక్షన్స్ తో దూసుకువెళ్తోంది.
కరుప్పునే విజయ్ చివరి సినిమా అని ఆర్జే బాలాజీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ' మొదట కరుప్పు కథతో విజయ్ వద్దకు వెళ్ళాను. అప్పటికే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. 2, 3 సార్లు మీట్ అయ్యాము. ఒక్క సినిమా చేసి సినిమాలు ఆపేద్దామని, రాజకీయ పరంగా ఎదగాలని అనుకుంటూనే కొన్నేళ్ళు సాగింది. ఆ తరువాత విజయ్ కిరెండు కథలు వినిపించాను. ఆయన నాతో సినిమా చేయను అని చెప్పారు. ఇది ఆయన కెరీర్‌లో చివరి సినిమా కాబోతుండటంతో, రాజకీయ సమీకరణాలు, వేరే కథల ఎంపిక వంటి పలు కారణాల వల్ల విజయ్ ఈ ప్రాజెక్ట్ నుండి గౌరవప్రదంగా తప్పుకున్నారు. ఆయన చెప్పిన కారణాలు చాలా జస్టిఫైడ్‌గా అనిపించాయి. అందుకే తాము ఆయన నిర్ణయాన్ని గౌరవించామని' చెప్పాడు
అంతేకాకుండా కరుప్పు సినిమా వినేటప్పుడు విజయ్ ఇచ్చిన సలహాలు, సూచనలతోనే తాము సూర్యను కలిసి కథ చెప్పినట్లు తెలిపాడు. దానివల్లనే సూర్య వెంటనే కథ ఒప్పుకున్నాడని, కొన్ని మార్పులు, చేర్పులు చేసి సూర్యకు తగ్గట్లు కరుప్పు సిద్ధమైంది. ఇదంతా విజయ్ వలనే అని ఆర్జే బాలాజీ చెప్పుకొచ్చాడు. ఇక కరుప్పులో త్రిష హీరోయిన్. ఒకవేళ విజయ్ ఈ సినిమాను ఒప్పుకొని ఉంటే ఆయన దేవుడు.. త్రిష భక్తురాలిగా కనిపించేది. విజయ్ ఈ కథకు నో చెప్పడంతో అది మిస్ అయ్యింది. అదే వీరభద్రుడుగా విజయ్.. ఆయన భక్తురాలిగా త్రిష కనిపించి ఉంటే.. సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.