జాకీగా మారిన ధ్రువ్ విక్రమ్.. పోస్టర్ అదిరింది
ABN , Publish Date - Sep 13 , 2026 | 07:11 PM
కోలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో, చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ ఈమధ్యకాలంలో వరుస వవివాదాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న విషయం తెల్సిందే.
కోలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో, చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram ఈమధ్యకాలంలో వరుస వవివాదాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న విషయం తెల్సిందే. వ్యక్తిగతమైన విషయాలు పక్కన పెడితే.. వృత్తిపరంగా కూడా ధ్రువ్ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ప్రస్తుతం ధ్రువ్.. మైత్రీ మూవీ మేకర్స్ లో ఒక సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. డివి4 అనే పేరుతో పూజా కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకుంది. అయితే ఈ సినిమా కన్నా ముందు రమేష్ వర్మ దర్శకత్వంలో ధ్రువ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ, ఆ షూటింగ్ కి హీరో వెళ్లకపోవడం వలన నిర్మాతలు చాలా నష్టపోవడంతో వారు ధ్రువ్ పై కేసు వేశారు. లెక్క ప్రకారం చూస్తే డివి4 మా సినిమా అవుతుందని, చేస్తే మా సినిమా చేయాలని, లేకపోతే మాకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని నిర్మాతలు డిమాండ్ చేశారు.
అయితే ఈ కేసు ఏమైందో తెలియదు కానీ.. ధ్రువ్, తన తదుపరి ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాడు. మైత్రీలోనే తన నాలుగవ సినిమా చేయన్నట్లు ధ్రువ్ ప్రకటించాడు. తాజాగా డివి4 టైటిల్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. జాకీ అనే టైటిల్ ని ఖరారు చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ టైటిల్ కి నో రీటేక్స్ అలౌడ్ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. ఈ చిత్రానికి కరణ్ ఎ. కుమార్ వహిస్తున్నాడు. ఇక పూర్తి స్థాయి ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. విలక్షణమైన సంగీతంతో శ్రోతలను అలరించే ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తుండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్, సంతోష్ నారాయణన్ మ్యూజిక్ తోడవ్వడంతో ఈ సినిమాపై తమిళంతో పాటు తెలుగులోనూ అప్పుడే మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.
మాస్, యాక్షన్ మరియు వినోదం సమపాళ్లలో మేళవించి రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ధ్రువ్ కెరీర్‌లో ఒక మైలురాయిలా నిలుస్తుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. టాప్ క్లాస్ టెక్నీషియన్లతో తెరకెక్కుతున్న జాకీ చిత్రం ధ్రువ్ విక్రమ్‌కి ఎలాంటి మాస్ విజయాన్ని అందిస్తుందో చూడాలని సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.