ప్లాప్ డైరెక్టర్ తో ధనుష్ ..
ABN , Publish Date - Jun 05 , 2026 | 09:43 PM
కర సినిమాతో పరాజయాన్ని అందుకున్నాడు ధనుష్ (Dhanush). ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. విజయాపజయాలను లెక్కచూసుకోని ధనుష్ తన తరువాత సినిమాపై దృష్టి పెట్టాడు.
కర సినిమాతో పరాజయాన్ని అందుకున్నాడు ధనుష్ (Dhanush). ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. విజయాపజయాలను లెక్కచూసుకోని ధనుష్ తన తరువాత సినిమాపై దృష్టి పెట్టాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా, దర్శకుడిగా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్న ఆయన, తాజాగా కంగువ చిత్ర దర్శకుడు శివ (Siva) తో ఒక భారీ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌ను ఎమోషన్స్‌తో పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేయడంలో దిట్ట అయిన దర్శకుడు శివ, ధనుష్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.
ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారని సమాచారం. అయితే కంగువ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్న శివకు ధనుష్ ఎలా ఛాన్స్ ఇచ్చాడని కోలీవుడ్ లో చర్చలు మొదలయ్యాయి. కథ నచ్చితే.. ధనుష్ డైరెక్టర్ ఎలాంటివాడు అనేది చూడడు. ఈ కథ కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సెంటిమెంట్ మిక్స్ అయ్యి ఉంటుందంట. కథ నచ్చడంతోనే ధనుష్ వెంటనే ఓకే చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం ధనుష్ తాను నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రాలతో పాటు మరికొన్ని కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నాడు. అలాగే దర్శకుడు శివ కూడా తన మునుపటి ప్రాజెక్ట్ పనుల అనంతరం ఈ సినిమా స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నట్లు టాక్. అన్ని అనుకూలిస్తే, వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని కోలీవుడ్ వర్గాల్లో సమాచారం . ధనుష్ నటన, శివ మాస్ టేకింగ్ కలిసి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయోనని అటు అభిమానులు, ఇటు పరిశ్రమ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.