అజిత్ తల్లి మరణం.. స్వయంగా వచ్చి ఓదార్చిన సీఎం విజయ్
ABN , Publish Date - May 31 , 2026 | 09:09 AM
ఇండస్ట్రీలో హీరోల ఫ్యాన్స్ మధ్య వార్స్ ఉంటాయేమో కానీ, హీరోల మధ్య కాదు. అది టాలీవుడ్ అయినా.. కోలీవుడ్ అయినా.. హీరోలు ఎప్పుడు ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఉంటారు. తాజాగా ఆ విషయాన్ని మరోసారి రుజువుచేశారు తమిళ్ హీరోలు అజిత్ (Ajith)- విజయ్ (Vijay).
ఇండస్ట్రీలో హీరోల ఫ్యాన్స్ మధ్య వార్స్ ఉంటాయేమో కానీ, హీరోల మధ్య కాదు. అది టాలీవుడ్ అయినా.. కోలీవుడ్ అయినా.. హీరోలు ఎప్పుడు ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఉంటారు. తాజాగా ఆ విషయాన్ని మరోసారి రుజువుచేశారు తమిళ్ హీరోలు అజిత్ (Ajith)- విజయ్ (Vijay). వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ, రియాలిటీలో అజిత్ - విజయ్ మంచి ఫ్రెండ్స్. ఆ స్నేహ బంధం ఎప్పుడూ కూడా వారు కొనసాగిస్తూనే ఉంటారు.
శనివారం అజిత్ మాతృమూర్తి మోహిని మణి (Mohini Mani) అనారోగ్య కారణాలతో కన్నుమూసిన విషయం తెల్సిందే. ఈ వార్త తెలియగానే కోలీవుడ్‌తో పాటు సౌత్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. అజిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు. ఇక ఫ్రెండ్ తల్లి మరణవార్త విన్న విజయ్ సైతం.. అజిత్ ఇంటికి వచ్చి మోహిని మణి భౌతికకాయానికి నివాళులర్పించారు. అజిత్‌ను ఆత్మీయంగా కౌగిలించుకుని ఓదార్చారు.
అజిత్, విజయ్ ఇద్దరూ స్క్రీన్‌పై ఎంతటి పెద్ద పోటీదారులైనా.. వ్యక్తిగతంగా వారి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ కష్టసమయంలో విజయ్ స్వయంగా వచ్చి అజిత్ కుటుంబానికి ధైర్యం చెప్పడం అక్కడి వారిని కదిలించింది. విజయ్ తో పాటు త్రిష కూడా అజిత్ ఇంటికి వచ్చి ఆయనను పరామర్శించింది. అజిత్ భార్య శాలినిని, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి వారు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.