Vikram: సరదాగా వీడియో పెట్టాడు.. చిక్కుల్లో పడ్డాడు

ABN , Publish Date - Aug 11 , 2026 | 04:21 PM

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఊహించని వివాదంలో చిక్కుకున్నాడు. సోషల్ మీడియాలో ఆయన సరదాగా షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం ఆయనను చట్టపరమైన సమస్యల్లోకి నెట్టింది.

Chiyaan Vikram

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) ఊహించని వివాదంలో చిక్కుకున్నాడు. సోషల్ మీడియాలో ఆయన సరదాగా షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం ఆయనను చట్టపరమైన సమస్యల్లోకి నెట్టింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విక్రమ్.. తాజాగా ఒక అరుదైన విదేశీ జాతి కోతితో కలిసి విక్రమ్ రీల్ చేసి పోస్ట్ చేశాడు. అది వైల్డ్‌లైఫ్ అధికారుల దృష్టికి వెళ్లడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఇక ఈ వీడియోలో సదరు విదేశీ కోతి హావభావాలను ఇమిటేట్ చేస్తూ విక్రమ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. అయితే వన్యప్రాణుల సంరక్షణ నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి అరుదైన జీవులను ఇంట్లో ఉంచుకోవడంపై కొందరు వైల్డ్‌లైఫ్ అధికారులకు, అటవీ శాఖకు ఫిర్యాదు చేశాడు. నెటిజన్ల నుంచి కూడా విమర్శలు రావడంతో విక్రమ్ తక్షణమే ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతా నుంచి డిలీట్ చేశాడు. అయినప్పటికీ అటవీ శాఖ అధికారులు సదరు వీడియో ఆధారంగా సమగ్ర విచారణ ప్రారంభించారు.


అటవీ శాఖ ప్రాథమిక విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియో విక్రమ్ ఇంట్లో కాకుండా, ఆయన కూతురు అత్తింట్లో తీసినట్లు అధికారులు గుర్తించారు. విక్రమ్ తన వియ్యంకుడు, ప్రముఖ వ్యాపారవేత్త సీకే రంగనాథన్ ఇంటికి వెళ్లిన సమయంలో ఈ రీల్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ అరుదైన విదేశీ కోతిని రంగనాథన్ ఎక్కడి నుండి కొనుగోలు చేశారు? దీని వెనుక ఏమైనా అంతర్జాతీయ వన్యప్రాణుల అక్రమ రవాణా ముఠా హస్తం ఉందా? అనే కోణంలో అటవీ శాఖ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో స్పష్టత కోసం హీరో విక్రమ్‌తో పాటు బిజినెస్‌మెన్ సీకే రంగనాథన్‌ను కూడా అధికారులు త్వరలోనే విచారించనున్నట్లు సమాచారం. విక్రమ్ సరదా కోసం తీసిన రీల్ .. ఇప్పుడు అతన్ని చిక్కుల్లోకి నెట్టింది. మరి ఈ వివాదంపై విక్రమ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Updated Date - Aug 11 , 2026 | 04:27 PM