కాలగర్భంలోకి.. మరో సినిమా థియేటర్
ABN , Publish Date - Nov 26 , 2026 | 08:16 AM
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకు లకు వినోదాన్ని అందించిన చెన్నై ఎగ్మోర్‌లోని ప్రముఖ ఆల్బర్ట్ థియేటర్ మూతపడింది.
చెన్నై మహానగరంలో ఉన్న ఆల్బర్ట్ థియేటర్ కనుమరుగు కానుంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకు లకు వినోదాన్ని అందించిన థియేటర్ నేడు కాలగర్భంలో కలిసిపోనుంది. ఇప్పటికే నగరంలో అనేక థియేటర్లు మూసి వేయడమే కాకుండా, వాటి ఆనవాళ్ళే లేకుండా చేశారు. ఇపుడు ఆల్బర్ట్ థియేటర్ ఆ జాబితాలో చేరనుంది. దీనికి కారణం కొవిడ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్ల వైపు వెళ్ళడం. మానేశారు. ఇంట్లోనే తమకు నచ్చిన సినిమాలను ఓటీటీల్లో చూస్తున్నారు.
ఈ కారణంగా కొవిడ్ ముందు, తర్వాత చెన్నై నగరంలో (Chennai Cinema Halls) అబిరాబి, శాంతి, నాగేష్, సఫైర్, గెయిటీ, వెల్లింగ్టన్, రాక్సీ, మేఘల, భువనేశ్వరి, చిత్ర, కబాలి, ఉమ, రాజకుమారి, పారగన్, ప్లాజా, నేషనల్, వాణి, వసంతి, స్లార్, ఆనంద్, లియో, అలంకార్, పైలెట్, ప్రసాద్, మోక్షం, రామ్, జయప్రద, లిబర్టీ, మెలోడీ, పద్మనాథన్, బ్రాడ్వే సహా అనేక థియేటర్లు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎగ్మోర్ ప్రాంతంలో ల్యాండ్ మార్కుల్లో ఒకటైన ఆల్బర్ట్ థియేటర్ ఇపుడు మూతపడింది.

ఈ థియేటర్లో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన అనేక చిత్రాలు విడుదలై ఘన విజయం సాధించి శతదినోత్సవ వేడు కలను జరుపుకున్నాయి. మొత్తం 1200 సీటింగ్ కెపాసిటీతో ఆల్బర్ట్, 240 సీట్లతో బేబీ ఆల్బర్ట్ (Baby Albert) థియేటర్లు ఉన్న ఈ సినీ కాంప్లెక్స్‌లో చివరగా సీఎం విజయ్ నటించిన జననాయగన్ (Jana Nayagan) చిత్రాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత థియేటర్ ప్రాంగణాన్ని మూసివేశారు. ఈ థియేటర్‌ను కూల్చివేసి బహుళ అంతస్తు భవన సముదా యాన్ని నిర్మించనున్నారనే ప్రచారం సాగుతోంది.