ధృవ్ విక్రమ్‌తో బ్రేకప్.. అనుపమ ఆ పోస్ట్ పెట్టిందేంటి

ABN , Publish Date - Oct 17 , 2026 | 09:07 PM

టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) వ్యక్తిగత జీవితం, సినిమాల గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.

Anupama Parameswaran

టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) వ్యక్తిగత జీవితం, సినిమాల గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా గతంలో ఆమె రిలేషన్‌షిప్స్, బ్రేకప్‌లు, ఆమె చేసిన వ్యాఖ్యలపై నెట్టింట రకరకాల చర్చలు నడుస్తుంటాయి. తాజాగా ఈ భామ.. తన మాజీ లవర్ ధృవ్ విక్రమ్ పోస్టర్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం సోషల్  మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 


విక్రమ్ తనయుడు, యువ నటుడు ధృవ్ విక్రమ్‌తో అనుపమ గతంలో ప్రేమలో ఉందని, ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారంటూ కొద్దికాలంగా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. అంతేకాకుండా, గతంలో తాను ప్రేమించిన వ్యక్తి చాలా టాక్సిక్ అని, తన జీవితంలో తీవ్రమైన మానసిక వేదనను మిగిల్చాడని అనుపమ పరోక్షంగా ఒక ఇంటర్వ్యూలో  చెప్పుకొచ్చింది.  బ్రేకప్ తరువాత ఆమె వరుస సినిమాలతో బిజీగా మారింది. తాజాగా అనుపమ నటించిన క్రేజీ కళ్యాణం మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. 


ఇక టాలెంటెడ్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన క్రేజీ స్పోర్ట్స్ డ్రామా బైసన్ సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ అనుపమ సోషల్ మీడియాలో బైసన్ సినిమా పోస్టర్‌ను షేర్ చేసింది. కబడ్డి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమ నటనకు, అలాగే ధృవ్ విక్రమ్‌తో ఆమె ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి ప్రశంసలు దక్కాయి.


ఇక బ్రేకప్ అయ్యాక ఏ హీరోయిన్ కూడా ఇలాంటి పోస్టులు పెట్టదు. కానీ, అనుపమ మాత్రం కేవలం ధృవ్ ఉన్న పోస్టర్ ని మాత్రమే షేర్ చేసి షాక్ ఇచ్చింది. ఈ పోస్టర్ చూసిన నెటిజన్స్ బ్రేకప్ అయ్యాక కూడా మాజీ లవర్ పోస్టర్ ని షేర్ చేయడం అనేది చాలా మంచి విషయమని చెప్పుకొస్తున్నారు.

Updated Date - Oct 17 , 2026 | 09:12 PM