ఆ హీరోతో అనుపమ బ్రేకప్.. పోస్ట్ వైరల్

ABN , Publish Date - Jul 19 , 2026 | 02:22 PM

టాలీవుడ్, కోలీవుడ్‌లో మోస్ట్ అడోరబుల్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram), మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లవ్ ట్రాక్‌కు ఎండ్ కార్డ్ పడిందా? అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు

Anupama Parameswaran

టాలీవుడ్, కోలీవుడ్‌లో మోస్ట్ అడోరబుల్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram), మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లవ్ ట్రాక్‌కు ఎండ్ కార్డ్ పడిందా? అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై నెట్టింట రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే, వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటున్న ఫోటో సోషల్ మీడియాని షేక్ చేసింది. ఆ తరువాత ఎక్కడ చూసినా ఈ జంటనే కనిపించింది. ఇక గతేడాది బైసన్ సినిమాలో ఈ జంట కలిసి నటించారు. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారు అనుకున్నారు. కానీ, ఈలోపే ఈ బంధం ముగిసింది అంటూ అనుపమ ఇన్ డైరెక్ట్ గా బ్రేకప్ ని కన్ఫర్మ్ చేసింది.


తాజాగా అనుపమ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఒక సుదీర్ఘమైన పోస్ట్ ఈ బ్రేకప్ వార్తలను దాదాపు ఖరారు చేసింది. 'చివరికి నా ప్రశాంతతను వెతుక్కోవడానికి కొన్ని డెడ్ ఎండ్స్ వదిలేయాల్సి వచ్చింది' అంటూ ఆమె షేర్ చేసిన పదాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 'కొన్నిసార్లు, చివరికి మన మనశ్శాంతిని మనం కనుగొనడం కోసం ముగిసిపోయిన బంధాలను వదిలేయాల్సి వస్తుంది. ఈ రోజు, ఆ ప్రశాంతత నన్ను వరించింది. ఈ రోజు నుంచి నా గొంతుకను నేనే ఎంచుకుంటున్నాను. నా జీవితాన్ని నేనే ఎంచుకుంటున్నాను. ఇకపై ఎవరి అనుమతులూ అవసరం లేదు. ఎలాంటి భయాలూ లేవు. నా దారిలో నేను మళ్లీ ప్రయాణిస్తూ, నన్ను నేను కనుగొంటూ.. నాదన్న సంగతే దాదాపు మర్చిపోయిన నా జీవితంతో నేను మళ్లీ ప్రేమలో పడుతున్నాను.


చాలా కాలంగా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఒకటి ఉంది.. చాలా కాలం పాటు నన్ను చెప్పనివ్వకుండా ఆపేసిన విషయం అది. మీ అందరినీ నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నా వెనుక నిలబడినందుకు, నన్ను నమ్మినందుకు, నా జీవితాన్ని ఇంతటి ప్రేమతో నింపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గతంలో నేను ఈ మాటను తగినంతగా చెప్పి ఉండకపోవచ్చు, కానీ నేను ఎల్లప్పుడూ ఆ ప్రేమను అనుభూతి చెందుతూనే ఉన్నానని దయచేసి తెలుసుకోండి. నాకు అత్యంత అవసరమైన సమయంలో మీ ప్రతి సందేశం, ప్రతి ప్రార్థన, మీ ప్రతి దయాగుణం నన్ను చేరుకున్నాయి. నన్ను మళ్లీ నా వైపుకే నడిపించినందుకు ఆ విశ్వానికి నా ధన్యవాదాలు. ఇకపై అంతా నయం కావాలి. స్వేచ్ఛ వికసించాలి. నన్ను నేను ఎంచుకోవాలి. చివరికి.. పూర్తిగా ఎలాంటి మొహమాటం లేకుండా నా స్వంతమైన నా జీవితానికి స్వాగతం'. అంటూ రాసుకొచ్చింది.


ఈ సుదీర్ఘ పోస్ట్‌లో అనుపమ తన అంతర్గత ఆవేదనను, స్వేచ్ఛను చాలా ఎమోషనల్‌గా వ్యక్తపరిచింది. ఆమె ధ్రువ్ విక్రమ్‌తో ఉన్న బంధం నుండి బయటకు వచ్చి, తనను తాను రికవర్ చేసుకునే పనిలో పడిందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఎక్కడా ధ్రువ్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ.. తనను ఇంతకాలం ఎవరో కంట్రోల్ చేశారనే అర్థం వచ్చేలా ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ లో ధ్రువ్ ని అన్ ఫాలో చేయడంతో ఈ బ్రేకప్ నిజమేనని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.

Updated Date - Jul 19 , 2026 | 02:46 PM