ఓం .. శ్రీలీలకి అక్కడ కూడా చుక్కెదురే
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:15 PM
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush, మమ్ముట్టి (Mammootty), సాయి పల్లవి, శ్రీలీల వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన చిత్రం ఓం(OM). అమరన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ని అందుకుంటుంది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush, మమ్ముట్టి (Mammootty), సాయి పల్లవి, శ్రీలీల వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన చిత్రం ఓం(OM). అమరన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ని అందుకుంటుంది. ముఖ్యంగా తెలుగులో నెగిటివ్ టాక్ తో నడుస్తోంది. ఇక ఈ సినిమాపై అందాల భామ శ్రీలీల ఎన్నో ఆశలు పెట్టుకుంది. టాలీవుడ్‌ను వదిలేసి కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న శ్రీలీలకు ఓం సినిమాతో మంచి పేరు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇందులో శ్రీలీల పాత్ర అంతగా ఏమీ లేదని, అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో కూడా తెలియలేదని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. దీంతో కోలీవుడ్‌లోనూ శ్రీలీలకు చుక్కెదురైందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
స్టార్ క్యాస్టింగ్ .. దానికి తోడు సాయి అభ్యంకర్ సంగీతం.. ఈ క్రేజీ కాంబినేషన్లే ప్రేక్షకులను ఓం సినిమా వైపు బలంగా నడిపించాయి. విడుదల ముందు నుంచే ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ అవ్వడానికి ప్రధాన కారణం ఈ స్టార్ పవర్, మ్యూజిక్ హైప్. భారీ అంచనాలతో థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం, ఆరంభంలోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. కానీ థియేటర్లోకి వెళ్లిన తర్వాత సినిమా మాత్రం పూర్తిగా నిరాశపరిచిందని, ఇంతటి దిగ్గజ నటీనటులను పెట్టుకుని, వారి పాత్రలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం పెద్ద మైనస్‌గా మారిందని చెప్పుకొస్తున్నారు.
మమ్ముట్టి వంటి లెజెండరీ నటుడి పాత్రను సరిగ్గా డిజైన్ చేయకపోవడం అభిమానులకు నిరాశ మిగిల్చిందని, అలాగే సాయి పల్లవి పాత్ర కూడా అరకొరగానే సాగిందని, ముఖ్యంగా మేకర్స్ ఎంచుకున్న బేసిక్ పాయింట్ బాగానే ఉన్నప్పటికీ, దాన్ని ఆసక్తికరంగా మలిచే సరైన స్క్రిప్ట్ తయారు చేయడంలో టీమ్ తడబడిందని అంటున్నారు. కథను నడిపించే బలమైన విలనీ లేకపోవడం కూడా సినిమాకు పెద్ద లోటుగా మారిందని, ఎప్పుడైతే తీసుకున్న పాయింట్ బాగున్నా స్క్రిప్ట్ లోపాలతో నిండి ఉంటుందో, అప్పుడు సినిమా మొత్తం సాగతీతగా, ప్రేక్షకులకు భారంగా నడుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక శ్రీలీలకి అయితే ఈ సినిమా ఏమాత్రం ఉపయోగపడదని, ఆమె దీని మీద ఆశలు వదిలేసుకుంటే మంచిదని అంటున్నారు. ప్రస్తుతం శ్రీలీల, ధర్మాన్ లో ఒక కీలక పాత్రలో నటింస్తోండగా.. అజిత్ డేర్ డెవిల్ లో హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ రెండు సినిమాలి అయినా అమ్మడిని కోలీవుడ్ లో నిలబెడతాయేమో చూడాలి.