Amala Paul: ఇప్పుడు నగ్నంగా నటించడం కష్టం
ABN , Publish Date - Sep 30 , 2026 | 04:49 PM
'మైనా', 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో', 'రఘువరన్ బిటెక్' వంటి సినిమాలతో దక్షిణ భారతదేశంలో మంచి విజయం సాధించిన నటిగా గుర్తింపు తెచ్చుకుంది అమలా పాల్.
'మైనా', 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో', 'రఘువరన్ బిటెక్' వంటి సినిమాలతో దక్షిణ భారతదేశంలో మంచి విజయం సాధించిన నటిగా గుర్తింపు తెచ్చుకుంది అమలా పాల్. ఇటీవల ఆమె పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన 'ది గోట్ లైఫ్' (ఆడుజీవితం), అలాగే 'లెవెల్ క్రాస్' వంటి విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రయోగాత్మకమైన పాత్రలు ఎంచుకుంటూ తన నటనతో ప్రత్యేకమైన ముద్ర వేసిన అమల, ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తూనే తనకు తగిన కథల కోసం ఎదురుచూస్తుంది.
తాజాగా అమలా పాల్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె 2019లో వచ్చిన ఆడై.. తెలుగులో ఆమె సినిమాలో నటించిన అనుభవాలను గుర్తుచేసుకుంది. ఆ సినిమాలో బోల్డ్, నగ్న దృశ్యాలలో నటించడంపై స్పందిస్తూ, 'ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది. నా ఇమేజ్ ఎక్కడ పాడవుతుందో, ఇకపై నాకు ఇలాంటి పాత్రలే ఇస్తారేమో అని కంగారు పడ్డాను. ఒకవేళ ఇప్పుడు నన్ను 'ఆడై' లాంటి సినిమా చేయమని అడిగితే, నేను ఖచ్చితంగా చేయననే చెప్తాను'అని తేల్చి చెప్పింది.
ఆ సీన్లలో నటించడానికి ముందు తాను పడ్డ మానసిక సంఘర్షణ గురించి చెప్తూ, 'దర్శకుడు రత్నకుమార్ ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో, కథకు తగ్గట్టు తీస్తారో లేక కేవలం న్యూడిటీ కోసమే వాడుకుంటారో అని ఆలోచించాను. చిత్ర బృందం నమ్మకాన్ని కలిగించడానికి నాకు దాదాపు రెండు నెలల సమయం పట్టింది. కేవలం సినిమా కథకు అవసరం అని, దాన్ని క్రియేటివ్‌గా తీస్తారని నమ్మకం కుదిరిన తర్వాతే నేను ఆ పాత్రకు ఓకే చెప్పాను. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌లపై నాకు పూర్తిగా నమ్మకం ఏర్పడింది. చిత్రీకరణ సమయంలో సెట్‌లో చాలా తక్కువ మంది సభ్యులు మాత్రమే ఉండేలా చూసుకుని నాకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించారు. అదొక అందమైన సృజనాత్మక ప్రయాణంగా సాగింది. ఆ రోజుల్లో అంత పెద్ద రిస్క్ తీసుకున్నందుకు సంతోషంగానే ఉన్నా, ప్రస్తుత పరిస్థితిలో మాత్రం అలాంటి పాత్రలు మళ్లీ చేయలేను" అని ఆమె తెలిపింది.