డార్క్ డెవిల్ గా మారిన అజిత్..

ABN , Publish Date - Aug 03 , 2026 | 07:40 PM

గత కొన్నేళ్లుగా కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ సరైన సాలిడ్ హిట్ పడకపోవడం, మరోవైపు ఆయన వరుసగా సినిమాలు చేయకుండా సుదీర్ఘ విరామం తీసుకోవడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తోంది.

Dark Devil

గత కొన్నేళ్లుగా కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ (Ajith Kumar) సరైన సాలిడ్ హిట్ పడకపోవడం, మరోవైపు ఆయన వరుసగా సినిమాలు చేయకుండా సుదీర్ఘ విరామం తీసుకోవడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తోంది. అయితే, తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడైన దళపతి విజయ్ సినిమాలు తగ్గించుకుని రాజకీయాల వైపు అడుగులు వేసి సినిమాలకు దూరం అవ్వడంతో.. ఇప్పుడు కోలీవుడ్ బాక్సాఫీస్ ఆశలన్నీ ఒక్కసారిగా అజిత్ పైనే పడ్డాయి. విజయ్ లేని లోటును భర్తీ చేస్తూ కోలీవుడ్‌ను ముందుండి నడిపించే భారం ఇప్పుడు అజిత్‌పైనే ఉందనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది.


ఈ నేపధ్యంలోనే అజిత్ తన తదుపరి బిగ్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాడు. యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌తో కలిసి ఆయన మరో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రాగా, అది తెలుగులో ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని అధిక్ చాలా పగడ్బంధీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రానికి డేర్ డెవిల్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని అజిత్ భార్య షాలిని అజిత్ కుమార్ బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.


అధిక్ రవిచంద్రన్ - అజిత్ కాంబోలో రాబోతున్న డేర్ డెవిల్ ప్రాజెక్ట్ పై తమిళ తంబీలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. విజయ్ తో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తూ, అజిత్ ఈ డేర్ డెవిల్ తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పక్కా మాస్ యాక్షన్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు రానుంది. మరి ఈ సినిమాతోనైనా ఈ కాంబో హిట్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.

Updated Date - Aug 03 , 2026 | 08:01 PM