స్టాలిన్‌గా.. సముద్రఖని! స్వీయ దర్శకత్వంలో.. సీఎం బయోపిక్
ABN , Publish Date - Mar 17 , 2026 | 08:04 AM
దక్షణాదిన మరో ఆసక్తికరమై బయోపిక్ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుత డీఎంకే అధ్యక్షుడు, తమిళ నాడు ముఖ్యమంత్రి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ బయోపిక్ రూపు దాల్చుతోంది.
దక్షణాదిన మరో ఆసక్తికరమై బయోపిక్ (biopic) చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమాలు, రాజకీయాలకు సంబంధించి జయ లలిత, ఎన్టీఆర్ వంటి మహామహుల బయోపిక్‌లు తెరపైకి రాగా ఇప్పుడు ప్రస్తుత డీఎంకే అధ్యక్షుడు, తమిళ నాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి (Chief Minister ) ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ (M K Stalin) బయోపిక్ రూపు దాల్చుతోంది.
ఇప్పటికే ప్రముఖ దర్శక నటుడు సముద్రఖని (Samuthirakani) ఈ చిత్రానికి స్క్రిప్టు సిద్ధం చేస్తుండడం విశేషం. అంతేకాదు ఈ మూవీలో ఆయనే సీఎం స్టాలిన్ పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టనున్నారు. స్క్రిప్టు పనుల్లో మరో నటుడు, దర్శకుడు బోస్ వెంకట్ (Bose Venkat)సహకరిస్తున్నారు.

అలాగే, సముద్రఖని కూడా సీఎంకు అత్యంత సన్నిహితులుగా ఉండే నేతలను కలిసి వివరాలు సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రీప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చే యేడాది సెట్స్‌పైకి తీసుకెళ్ళా లన్న ఆలోచనలో సముద్రఖని ఉన్నట్టు సమాచారం. కాగా, సముద్ర ఖని నటుడిగా, దర్శకుడుగా రాణిస్తున్న విషయం తెల్సిందే. ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'తడయం' వెబ్ సిరీస్ ఘన విజయం సాదించింది. అలాగే, పలువురు అగ్ర హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతినాయకుడి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఇదిలాఉంటే.. అయితే స్టాలిన్ యుక్త వయసులో ఉన్నప్పుడు 80లలో రెండు సినిమాలలో హీరోగా కూడా చేశారు. అవి ఆశించిన ఫలితం ఇవ్వక పోవడంతో ఆపై పూర్తి స్తాయి రాజకీయ నాయకుడిగా మారిపోయారు. తిరిగి సినిమాల వైపు చూడలేదు. చూడాలి మరి ఈ బయోపిక్ చిత్రం ఏ మేర ప్రజలను అలరిస్తుందో.