Kollywood: తమిళ చిత్ర పరిశ్రమలో.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ ఇవే!

ABN , Publish Date - Nov 13 , 2026 | 09:37 AM

2026లో కోలీవుడ్‌లో ఇప్పటివరకు సుమారు 190 నుంచి 200 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు పది మాత్రమే.

tamil movies

ఈ యేడాది ఇప్పటి కోలీవుడ్ (Kollywood)లో విడుదలైన చిత్రాల సంఖ్య సుమారుగా 190 నుంచి 200 వరకు ఉండొచ్చు. అయితే, వీటిలో విజయవంతమైన చిత్రాల సంఖ్యను మాత్రం వేళ్ళపై లెక్కించవచ్చు. అలాగే, వసూళ్ళ పరంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాల సంఖ్య కూడా కేవలం పది మాత్రమే ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్ళను రాబట్టి జైలర్-2 (Jailer 2) మూవీ అగ్రస్థానంలో నిలిచింది. బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం దాదాపు రూ.850 కోట్ల వరకు వసూలు చేసినట్టు సమాచారం.

ఈ యేడాది ఇప్పటివరకు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాల సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉంది. ఆ జాబితాలో విజయ్ జననాయగన్ (Jana Nayagan), దర్శక హీరో లోకేష్ కనకరాజ్ 'డీసీ', సూర్య నటించిన కరుప్పు, 'విశ్వనాథ్ అండ్ సన్స్, తాజాగా దీపావళికి విడుదలైన 'సీన్' మూవీ, సూరి, హీరోగా నటించిన 'మందాడి, రాధిక నటించిన తాయ్ కిళవి (Thaai Kizhavi), విష్ణు విశాల్ గట్టాకుస్తి 2 ( Gatta Kusthi 2) హిప్ హాప్ ఆది నటించిన 'మీసైయ మురుక్కు- 2 (Meesaya Murukku 2), కెన్ కరుణాస్ నటించిన 'యూత్' వంటి చిత్రాలున్నాయి.

అలాగే, మరికొన్ని చిత్రాలు రూ.వంద కోట్ల క్లబ్లో చేరకపోయినప్పటికీ విశేషాదరణ పొందాయి. ఇలాంటి చిత్రాల్లో 'డోరతి', 'మొదరాత్రి', 'విత్ లవ్', 'తలైవర్ తంబి తలమైయిల్ వంటి మూవీలున్నాయి. అయితే, ఈ యేడాదిలో (2026)లో మరో ఏడు శుక్రవారాలు మాత్రమే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సుమారుగా 50 చిత్రాల మేరకు విడుదల కావొచ్చని భావిస్తున్నారు. వీటిలో ఎన్ని చిత్రాలు విజయం సాధించి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతాయో వేచి చూడాల్సిందే.

Updated Date - Nov 13 , 2026 | 09:49 AM