Suriya: 'కరుప్పు' దర్శకుడికి.. సూర్య కారు బహుమతి

ABN , Publish Date - Jun 15 , 2026 | 01:09 PM

దర్శకుడు ఆర్జే బాలాజీకి (RJ Balaji) హీరో సూర్య (Suriya) కారును బహుమతిగా ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'కరుప్పు' తాజాగా విడుదలై ఘన విజయం సాధించింది.

Suriya - Rj Balaji

దర్శకుడు ఆర్జే బాలాజీకి (RJ Balaji) హీరో సూర్య (Suriya) కారును బహుమతిగా ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'కరుప్పు' తాజాగా విడుదలై ఘన విజయం సాధించింది. పలు అవాంతరాల మధ్య మే 15న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.350 కోట్ల వరకు రాబట్టింది. సూర్య సినీ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. పైగా ఇది దశాబ్దకాలం తర్వాత సూర్యకు వచ్చిన విజయం. ఈ నేపథ్యంలో తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇచ్చిన దర్శకుడు ఆర్జే బాలాజీకి హీరో సూర్య కారును బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.


ఈ విషయాన్ని ఆర్జే బాలాజీ వెల్లడిస్తూ, 'ఈ సినిమా ప్రారంభించిన తొలి రోజు నుంచే మీరు నాపై పెట్టుకున్న నమ్మకం అనే కల నిజ జీవితంలో నిజమైంది. మీరిచ్చిన మద్దతు నా జీవితంలో సరికొత్త ప్రయాణానికి నాంది పలికింది. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని మీకు నేను ఇచ్చిన హామీ ఇపుడు నిజమైంది. ఇవన్నీ వాస్తవరూపంలో కార్యరూపం దాల్చడానికి ఒకే ఒక వ్యక్తి కారణం.. అదే మీరే సూర్య సార్' అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

మహిళా సాధికారత నేపథ్యంలో ‘అభ‌య‌’.. టైటిల్ పోస్ట‌ర్ ఇదే!

Vijay Deverakonda: రౌడీ స్టార్‌.. లైనప్ అదిరింది..

Updated Date - Jun 15 , 2026 | 01:31 PM