విడుదలకు ముందే.. 'కరుప్పు' ప్రదర్శన! షాక్‌లో కోలీవుడ్

ABN , Publish Date - May 15 , 2026 | 06:30 AM

హీరో సూర్య నటించిన 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడుస‌) సినిమా ఆనివార్య కారణాలతో గురువారం విడుదలకు నోచుకోలేదు.

karuppu

హీరో సూర్య (suriya) నటించిన 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడుస‌) (karuppu) సినిమా ఆనివార్య కారణాలతో గురువారం విడుదలకు నోచుకోలేదు. అయితే, ఈ చిత్రం. ఉత్తరాదిలో పలు థియేటర్లలో ప్రదర్శించారు. దీంతో తమిళ చిత్రపరిశ్రమ షాక్‌కు గురైంది.

'జన నాయగన్' లీక్ నుంచి చిత్రపరిశ్రమ తేరుకోకముందే 'కరుప్పు' సినిమాను ప్రముఖ కంపెనీ విడుదలకు ముందే పలు థియేటర్లలో ప్రదర్శించడం తమిళ సినిమా భవిష్యత్‌నే కాకుండా, యావత్ భారతీయ సినిమా భవిష్యత్ ప్రశ్నార్థకంగా మార్చిందని నడిగర్ సంఘం గురువారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.

ఈ చిత్రాన్ని ప్రదర్శించిన కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నష్టపోయిన నిర్మాతకు పరిహారం ఇప్పించేందుకు దక్షిణ భారత నిర్మాతల సంఘం చర్యలు చేపట్టాలని నడిగర్ సంఘం విజ్ఞప్తి చేసింది. ఒక సినిమా నిర్మాణంలో ఎంతోమంది కళాకారులు, కార్మికుల కష్టార్జితం, చెమట మాత్రమే కాకుండా, వారి భవిష్యత్ కూడా ఇమిడివుంటుందని గుర్తు చేసింది.

భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృత్తం కాకుండా, కఠినమైన నిబంధనలు రూపొందించాలని, ఈ పరిస్థితుల్లో తమిళ చిత్రపరిశ్రమలోని సభ్యులంతా ఏకతాటిపైకి నడిగర్ సంఘం రావాలని పిలుపునిచ్చింది. కష్టకాలంలో ఉండే నిర్మాతలకు ఎల్లవేళలా నడిగర్ సంఘం మద్దతుగా ఉంటుందని పేర్కొంది. కాగా, ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా, నిర్మాతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభులు నిర్మించారు.

Updated Date - May 15 , 2026 | 06:30 AM