Suriya Vs Nayanatara: హిట్ జోడీ.. ఇప్పుడు బాక్సాఫీస్ ప్రత్యర్థులు

ABN , Publish Date - Jul 21 , 2026 | 11:26 AM

సూర్య, నయనతార జంటగా  'గజిని', 'ఆధవన్', 'మాస్సు ఎంగిర మసిలామణి' వంటి చిత్రాల్లో కలిసి నటించారు. సక్సెస్ ఫుల్ పెయిర్ గా గుర్తింపు పొందారు.


సూర్య, నయనతార జంటగా  'గజిని', 'ఆధవన్', 'మాస్సు ఎంగిర మసిలామణి' వంటి చిత్రాల్లో కలిసి నటించారు. సక్సెస్ ఫుల్ పెయిర్ గా గుర్తింపు పొందారు. దక్షిణాది ప్రేక్షకులను అలరించిన ఈ స్టార్ జోడీ వెండితెరపై ఒకరికి ఒకరు పోటీ పడనున్నారు.  సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆగస్టు 14న  విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఇదే తేదీన నయనతార ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'హాయ్' చిత్రాన్ని కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ఒకే రోజు రెండు క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. 'హాయ్' చిత్రానికి లోకేష్ కనగరాజ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విష్ణు ఏడవన్ దర్శకత్వం వహిస్తున్నారు. యువ నటుడు కవిన్ హీరోగా నటిస్తుండగా, నయనతార కథానాయికగా కనిపించనున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కె. భాగ్యరాజ్, రాధికా శరత్‌కుమార్, ప్రభు, వీటీవీ గణేష్, సత్యన్, అమృత శ్రీనివాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రౌడీ పిక్చర్స్, 7 స్క్రీన్ స్టూడియో, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

మరోవైపు, 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంలో సూర్య సరసన యువ నటి మమిత బైజు నటిస్తున్నారు. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు ప్రధానాంశాలుగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. సూర్య గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాలో ఆయన పాత్ర ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు భావోద్వేగాలతో నిండిన ఫ్యామిలీ డ్రామా.. మరోవైపు వినోదభరితమైన రొమాంటిక్ కామెడీ. రెండు భిన్నమైన కథాంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సాధిస్తాయో చూడాలి.  

ఇవి కూడా చదవండి:

Sakshi Agarwal: చిరకాల స్వప్నం సాకారమైంది

రకుల్, కాజల్ ముందు సాయి పల్లవి వేస్ట్..

Mamitha Baiju: మమిత జోరు మాములుగా లేదు.. అసలు తగ్గట్లేదుగా

Updated Date - Jul 21 , 2026 | 05:11 PM