సిగ్మా సినిమాకు.. నన్ను రెఫర్ చేసింది ఆయనే
ABN , Publish Date - Sep 25 , 2026 | 11:36 AM
జేసన్ సంజయ్ దర్శకత్వంలో ఆమె నటించిన చిత్రం ‘సిగ్మా’(Sigma). ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కానుంది.
‘జేసన్ (Jason Sanjay) నాకు ‘సిగ్మా’ కథ చెప్పిన తర్వాత అతని వయసు ఎంతని అడిగితే.. 24 ఏళ్లన్నాడు. నాకు చాలా ఇన్‌స్పయిరింగ్‌గా అనిపించింది. నేను ఈ రంగంలో గట్టిగా కృషి చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను’ అని నటి ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)తెలిపారు.
జేసన్ సంజయ్ దర్శకత్వంలో ఆమె నటించిన చిత్రం ‘సిగ్మా’(Sigma). ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫరియా మాట్లాడుతూ ‘లైకా సంస్థ నిర్మించే సినిమాతో తమిళంలో పరిచయం కావడం ఆనందంగా ఉంది. సందీప్ కిషన్ (Sundeep Kishan) నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ సినిమాకు నన్ను రెఫర్ చేసింది కూడా ఆయనే.
అయితే జేసన్ అంతకు ముందే నా ‘జాతిరత్నాలు’ మూవీ చూసి ఉండటంతో వెంటనే కనెక్ట్ అయ్యారు. యక్షన్ అడ్వెంచర్ హైస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘సిగ్మా’ను తెరకెక్కించారు. ఇందులో రేడియో జాకీగా నటించాను. అన్ని రకాల ఎమోషన్స్‌ని చూపించే పాత్ర ఇది. భవిష్యత్తులో ఎవరికైనా ఆడిషన్ కాపీ చూపించాలంటే ఈ సినిమా సరిపోతుంది. అంతలా నాలోని యాక్టింగ్ స్కిల్స్‌ని ఇందులో ఎలివేట్ చేశారు. ఫ్యూచర్‌లో యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలని ఉంది’ అని అన్నారు.