Anugraha S. Nambiar: అగ్రిమెంట్ చేసుకుని అవకాశాలు ఇవ్వట్లేదు.. నటి ఆగ్రహం

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:35 PM

వెబ్‌ సిరీసుల్లో  అవకాశం ఇస్తానని మోసం చేశారని, ఇపుడు తన భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని, అందువల్ల తాను ఆత్మహత్య చేసుకుంటానని యువనటి అనుగ్రహ ఎస్‌. నంబియార్‌ (Anugraha S Nambiar) పేర్కొన్నారు.

వెబ్‌ సిరీసుల్లో అవకాశం ఇస్తానని మోసం చేశారని, ఇపుడు తన భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని, అందువల్ల తాను ఆత్మహత్య చేసుకుంటానని యువనటి అనుగ్రహ ఎస్‌. నంబియార్‌ (Anugraha S Nambiar) పేర్కొన్నారు. ఈ మేరకు ఒక వీడియోను రిలీజ్‌ చేశారు. ‘అడిపొలి’ ద్వారా వెండితెరకు పరిచయమైన అనుగ్రహ... ప్రస్తుతం ‘రిసార్ట్‌’ అనే వెబ్‌ సిరీస్ లో  నటిస్తున్నారు. ఇందులో హీరోగా విజయ్‌ కుమార్‌ నటిస్తున్నారు. ఈ  వెబ్‌సిరీస్‌  లో నటించేందుకు యేడాది పాటు అనుగ్రహ ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ, ఇప్పుడు అవకాశం ఇవ్వకుండా మోసం చేస్తున్నారంటూ ఆమె విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. ‘ఇపుడు నేను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యా. వెబ్‌సిరీస్‌ లో నటించేందుకు ఒక యేడాదికి అగ్రిమెంట్‌ కుదుర్చుకుని షూటింగ్‌కు పిలవడం లేదు. ఇతర చిత్రాల్లో నటించేందుకు కూడా అనుమతించడం లేదు. గత నాలుగు నెలలుగా ఇంటికే పరిమితమై ఉన్నా. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. చిత్రనిర్మాణ సంస్థను సంప్రదించగా, హీరో విజయ్‌ కుమార్‌ను సంప్రదించాలని చెప్పారు. దీంతో నా స్నేహితుడు విజయ్‌ కుమార్‌ను సంప్రదించగా ఆయన సమాధానం ఇవ్వకపోగా, ఆయన భార్య పరుష పదజాలంతో బెదిరింపు ధోరణితో మాట్లాడారు. కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నటించేందుకు అవకాశం ఇవ్వాలి. నేను కేరళ నుంచి ఇక్కడకు వచ్చాను. నాకు కలలు ఉంటాయి. ఛాన్స్‌ ఇవ్వకుంటే ఆత్మహత్యే నాకు శరణ్యం’ అని పేర్కొన్నారు. 

Updated Date - Apr 28 , 2026 | 01:20 PM