నిర్మాతగా మారనున్న అజిత్ కుమార్?

ABN , Publish Date - Apr 10 , 2026 | 09:43 AM

స్టార్ హీరో అజిత్ కుమార్ నిర్మాతగా మారనున్నారంటూ కోలీవుడ్‌లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది.

ajith kumar

స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నిర్మాతగా మారనున్నారంటూ కోలీవుడ్‌లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఆయన హీరోగా నటించే 64వ చిత్రాన్ని సొంతంగా నిర్మించాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ పోటీలపై ఆయన దృష్టి సారించారు. అలాగే గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly) మూవీ తర్వాత ఈ చిత్ర దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వంలోనే నటించేందుకు అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే, ఈ ప్రాజెక్టు కోసం ఆయన నిర్మాతగా మారాలని భావిస్తున్నారు. అజిత్ కుమార్ స్పోర్ట్స్ సర్వీస్ ఎల్ఎల్సీ అనే పేరుతో నిర్మాణ సంస్థ పేరును దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి (సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబ ర్)లో రిజిస్టర్ చేయించారు. రూ.2.56 లక్షలు చెల్లించి లైల్టైమ్ మెంబర్షిప్ కూడా తీసుకు న్నారు. నిర్మాతగా మారేందుకు ఫిల్మ్ చాంబర్‌లో అజిత్ సభ్యత్వం తీసుకున్నారని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే, నిర్మాతగా మారితే ఆయన హీరోగా నటిస్తారా లేదా అన్నది ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తన సొంత నిర్మాణ సంస్థపై ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించే చిత్రాన్ని నిర్మించేలా చర్యలు తీసుకున్నట్టు సమాచారం. దీనిపై మరో 15 రోజుల్లో స్పష్టమైన క్లారిటీ రావొచ్చని ఫిల్మ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - Apr 10 , 2026 | 09:43 AM