అజిత్‌తో శ్రీలీల... భలే కాంబినేషన్!
ABN , Publish Date - Feb 23 , 2026 | 07:24 AM
అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ఎక్కువగా రేసింగ్‌పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith kumar) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ఎక్కువగా రేసింగ్‌పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అజిత్ రాబోయే చిత్రం గురించి అనేక రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. అయితే.. తాజాగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీని డైరెక్ట్ చేసిన అధిక్ రవిచంద్రన్ (Adhik ravichandran) దర్శకత్వంలోనే అజిత్ కొత్త చిత్రం ఉండనున్నట్లు అధికారికంగా న్యూస్ వచ్చింది. కాగా ఇప్పుడు ఈ సినిమాలో కథానాయిక విషయం గురించి రూమర్స్ గట్టిగానే వస్తున్నాయి.
శివ కార్తికేయన్ 'పరాశక్తి' సినిమాతో ఈ మధ్యే తమిళంలో అడుగు పెట్టిన శ్రీలీల (Sreeleela) ఈ మూవీలో హీరోయున్‌గా చేయనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ తమిళంలోనూ వరుస బెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇటీవలే ధనుష్‌తో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది ఇంకా సెట్స్‌కు వెళ్లక ముందే ఇప్పుడు అజిత్ సరసన ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా.. ఈ ప్రాజెక్ట్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని టాక్. అజిత్‌కు తగిన స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఉండేలా కథను డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. అదే జరిగితే శ్రీలీల కెరీర్‌లో ఇది పెద్ద మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. త్వరలోనే మేకర్స్ ఈ అంశంపై క్లారిటీ ఇస్తారని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అజిత్ – శ్రీలీల కాంబినేషన్ నిజమైతే, దక్షిణాది సినీ రంగంలో మరో క్రేజీ జోడీగా నిలిచే ఛాన్స్ ఉంది.