వరుస ప్లాపులు.. సూపర్ ఛాన్స్ పట్టేసిన శ్రీలీల

ABN , Publish Date - Aug 06 , 2026 | 09:36 PM

పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది అందాల భామ శ్రీలీల. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ సరసన ధమాకా చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి, తన డాన్స్, ఎనర్జీతో రాత్రికి రాత్రే టాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.

Sreeleela

పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది అందాల భామ శ్రీలీల (Sreeleela). ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ సరసన ధమాకా చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి, తన డాన్స్, ఎనర్జీతో రాత్రికి రాత్రే టాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఈ సక్సెస్‌తో వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుని ప్రేక్షకులను మెప్పించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆ స్థాయిలో విజయాలను దక్కించుకోలేకపోయింది. అనుకోకుండా వచ్చిన వరుస ప్లాపులతో శ్రీలీల కెరీర్ తీవ్ర డేంజర్ జోన్‌లో పడింది. ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే ముద్ర పడటంతో తెలుగులో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్లిష్ట సమయంలో బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ సరసన ఒక భారీ హిందీ సినిమాలో ఛాన్స్ కొట్టేసి, దానిపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. బాలీవుడ్ ఎంట్రీతో తిరిగి ఫామ్‌లోకి రావాలని చూస్తున్న ఈ చిన్నదానికి ఇప్పుడు కోలీవుడ్ నుంచి ఊహించని బిగ్ ఆఫర్ తలుపు తట్టింది.


కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోన్న విషయం తెల్సిందే. కమల్ హాసన్ నిర్మాణంలో ధర్మాన్ సినిమా చేస్తున్నారు. ఇది కాకుండా కమల్ - రజినీ కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతోంది. వీటితో పాటు మరో సినిమాకు కూడా రజినీ లైన్లో పెట్టారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ లో ఒకదాంట్లో హీరోయిన్ గా శ్రీలీల ఎంపికైనట్లు తమిళ్ ఇండస్ట్రీ వ్యాప్తంగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వరుస పరాజయాల తర్వాత కూడా రజనీకాంత్ వంటి దిగ్గజ హీరో సరసన ఛాన్స్ రావడం శ్రీలీల కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైలురాయిగా మారనుంది. ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ గనుక హిట్ అయితే, శ్రీలీల సౌత్, నార్త్‌లలో మళ్లీ తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.


ప్రస్తుతం శ్రీలీల.. తన తల్లితో కలిసి దైవ దర్శనాలు చేస్తోంది. సినిమాలు లేకపోయినా కూడా అమ్మడు వాణిజ్య ప్రకటనలతో ఫుల్ బిజీగా ఉంటుంది. దానికి తోడు తన స్కిన్ ప్రొడక్ట్స్ బిజినెస్ ని కూడా చూసుకుంటుంది. కానీ, హీరోయిన్ గా శ్రీలీల నిలబడడం ఇప్పుడు చాలా ముఖ్యం. పరాశక్తి తరువాత తమిళ్ లో శ్రీలీల నటిస్తోన్న మూడో చిత్రం ఇది. ఈ సినిమా కాకుండా ధనుష్ నటిస్తోన్న ఓంలో శ్రీలీల నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాలతో అమ్మడు ఎలాంటి హిట్స్ ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Aug 06 , 2026 | 09:42 PM