Sreeleela: పాపం.. పరాశక్తి కూడా కాపాడలేకపోయిందే
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:35 PM
అందాల భామ శ్రీలీల (Sreeleela) కు అదృష్టం కలిరావడం లేదు అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మొదటి సినిమా రిలీజ్ అవ్వకుండానే వరుస ఆఫర్స్ అందుకున్న హీరోయిన్ గా శ్రీలీలకు ఒక రికార్డ్ ఉంది.
Sreeleela: అందాల భామ శ్రీలీల (Sreeleela) కు అదృష్టం కలిరావడం లేదు అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మొదటి సినిమా రిలీజ్ అవ్వకుండానే వరుస ఆఫర్స్ అందుకున్న హీరోయిన్ గా శ్రీలీలకు ఒక రికార్డ్ ఉంది. స్టార్ హీరోలు, కుర్ర హీరోలు.. ఇలా తేడా లేకుండా అందరితో నటించింది. కానీ, ఏం ప్రయోజనం.. అమ్మడి కెరీర్ లో ఒక్క హిట్ తప్ప మిగతావి అన్ని పరాజయాలే. శ్రీలీల ఏ సినిమా చేసినా.. దీంతో బ్రేక్ వస్తుంది అని ఆశ పడడం.. ఆ తరువాత దీంతో కూడా లేదా అని నిరాశ పడడం అభిమానులకు అలవాటుగా మారిపోయింది.
ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు ధమాకా తరువాత శ్రీలీల చేసిన అన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి. సరే తెలుగు ఇండస్ట్రీ అంతగా అచ్చిరాలేదేమో.. మన లక్ తమిళ్ లో ప్రయత్నిద్దామని శ్రీలీల పరాశక్తితో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవి మోహన్ విలన్ గా నటించగా.. అథర్వ కీలక పాత్రలో నటించాడు. ఇక శివకార్తికేయన్ సరసన శ్రీలీల కనిపించింది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎన్నో అంచనాల మధ్య జనవరి 10 న రిలీజైన పరాశక్తి మొదటి షో నుంచి మిక్స్డ్ టాక్ ను అందుకుంటుంది.
కథ బాగానే ఉన్నా కథనంలో చాలా లోపాలు కనిపించాయని చెప్పుకొస్తున్నారు. నటీనటుల నటన బావున్నా.. ఇంకా వాడుకోలేదని అంటున్నారు. కొంతమంది శ్రీలీల యాక్టింగ్ సెట్ అవ్వలేదని, సుధా కొంగర సినిమాల్లో హీరోయిన్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తుందని, కానీ రత్నమాలగా శ్రీలీల అంత పవర్ ఫుల్ గా లేదని పెదవి విరుస్తున్నారు. ఈ సినిమా కోసం ఈ చిన్నది చాలా కష్టపడింది. లుక్ మొత్తం మార్చేసింది. అయినా కూడా విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. పాపం ఈ చిన్నదాన్ని పరాశక్తి కూడా కాపాడలేకపోయింది. తమిళ్ లో కూడా శ్రీలీలకి మొదటి సినిమా కష్టంగానే మారింది. మరి ముందు ముందు పరాశక్తి మంచి టాక్ ని అందుకొని పైకి లేస్తే.. ఏమైనా శ్రీలీలకు వేరే ఛాన్స్ లు రావడానికి ఉపయోగపడుతుందేమో చూడాలి.