సినిమాలకు త్రిష గుడ్ బై..

ABN , Publish Date - May 10 , 2026 | 07:28 PM

ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న పేరు త్రిష కృష్ణన్ (Trisha Krishnan). అటు తమిళ్.. ఇటు తెలుగు ఇండస్ట్రీలలో త్రిష సంచలనం సృష్టిస్తోంది.

Trisha

ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న పేరు త్రిష కృష్ణన్ (Trisha Krishnan). అటు తమిళ్.. ఇటు తెలుగు ఇండస్ట్రీలలో త్రిష సంచలనం సృష్టిస్తోంది. తమిళనాడు సీఎం విజయ్ (Vijay).. ఎన్నికల్లో గెలవడానికి ఆమె కారణమని వార్తలు వస్తూనే ఉన్నాయి. నేడు విజయ్ ప్రమాణ స్వీకారం వేడుకలో ఆమెనే సెంట్రాఫ్ ఎంట్రాక్షన్ అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. నిండుగా చీరకట్టుకొని, కొప్పున మల్లెపూలు చుట్టుకొని అందంగా తయారయ్యి కనిపించింది. అంతేనా.. విజయ్ స్పీచ్ ఇస్తుంటే ఒక భార్య ఎంత ఎమోషనల్ అవుతుందో అంతకు మించి త్రిష ఎమోషనల్ అయ్యి కన్నీరు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


ఎట్టకేలకు విజయ్ సీఎం అయ్యాడు.. మరి త్రిష పరిస్థితి ఏంటి.. ? ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో విజయ్ గెలిచిన దగ్గరనుంచి త్రిషకు ఖచ్చితంగా సీటు ఇస్తాడని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. విజయ్ తాను వదిలేసిన సీటును త్రిషకు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తాడా.. ? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. తిరుచ్చిలో గెలిచిన విజయ్.. ఆ స్థానానికి రాజీనామా చేసి ఆ స్థానంలో త్రిషను నిలబెట్టనున్నాడట. ఇదే కనుక జరిగితే త్రిష ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయం.


రాజకీయాల్లోకి రావడం త్రిష చిన్నప్పటినుంచి కంటున్న కల. పదేళ్ల క్రితమే ఆమె సీఎం అవుతాను అని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పింది. ఇప్పుడు విజయ్ ఎలాగూ తోడు ఉన్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం ఇకనుంచి త్రిష ఎక్కువ రాజకీయాల మీదనే ఫోకస్ చేయనుందని తెలుస్తోంది. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి.. పూర్తిగా ప్రజాసేవకే అంకితమవ్వాలని చూస్తోందంట. ఎలాగూ త్రిష కొన్నాళ్లుగా పరాజయాలనే చవి చూస్తూ వస్తోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఉన్నవి రెండే సినిమాలు.. తెలుగులో విశ్వంభర.. తమిళ్ లో కరుప్పు. ఈ సినిమానే తెలుగులో వీరభద్రుడుగా రిలీజ్ చేస్తున్నారు. మే 14 న ఈ సినిమా రిలీజ్ కానుంది.


ఒకవేళ సినిమాల్లో త్రిష కొనసాగాలి అంటే.. కచ్చితంగా ఆమెకు ఒక మంచి హిట్ అనేది చాలా అవసరం. ఇప్పటివరకు కరుప్పు ప్రమోషన్స్ మొదలుపెట్టిందే లేదు. కథ నచ్చి రిలీజ్ తరువాత ప్రేక్షకులు ఆదరిస్తే ఓకే కానీ, లేకపోతే కరుప్పు కూడా అటకెక్కినట్టే. ఇవన్నీ ఆలోచించే త్రిష ప్రమోషన్స్ ని కూడా సీరియస్ గా తీసుకోలేదని, ఈ రెండు సినిమాలు కాకుండా ఆమె ఏ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరి అందాల భామ త్రిషను ఇకనుంచి గ్లామర్ లుక్ లో సినిమాల్లో చూస్తామా.. లేక సింపుల్ లుక్ లో క్యాబినెట్ లో చూస్తామా అనేది విజయ్ చేతిలోనే ఉంది.

Updated Date - May 10 , 2026 | 07:57 PM