Trisha: యూనివర్స్‌ ఇచ్చిన గిఫ్ట్‌ ఇది..

ABN , Publish Date - May 04 , 2026 | 06:17 PM

హీరోయిన్‌ త్రిష కృష్ణన్‌కు సోషల్‌ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Trisha Birthday

హీరోయిన్‌ త్రిష కృష్ణన్‌కు సోషల్‌ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పుట్టినరోజు సందర్భంగా త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సెలబ్రిటీలు, అభిమానులు రకరకాలుగా త్రిషను విష్‌ చేశారు. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పెట్టిన ఇన్‌స్టా స్టోరీ మాత్రం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘హ్యాపీ బర్త్‌డే బేబీ.. బహుశా నీకు ఇది బెస్ట్‌ బర్త్‌డే. లవ్‌ యూ డియర్‌’ అని వరలక్ష్మీ పోస్ట్‌ పెట్టారు. అలాగే మంచు లక్ష్మి కూడా శుభాకాంక్షలు తెలిపారు. యూనివర్స్‌ బెస్‌ గిఫ్ట్‌ ఇచ్చిందని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఎప్పుడూ అందంగా, హుందాగా ఉండే త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు, సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఇంతకుమించిన మంచి రోజు ఏముంటుంది. ఈ భారీ విజయంతో యూనివర్స్‌ మీకు బెస్ట్‌ గిఫ్‌ ఇవ్వాలని నిర్ణయించుకుంది. డబుల్‌ల సెలబ్రేషన్స్‌ చేసుకోండి. ఈ రోజును అద్భుతంగా ఎంజాయ్‌ చేయ్‌ డార్లింగ్‌’ అంటూ హార్ట్‌ ఎమోజీలను మంచు లక్ష్మీ రాసుకొచ్చారు. హీరోయిన్‌ నికిషా పటేల్‌ కూడా త్రిషకు శుభాకాంక్షలు తెలిపారు.

తిరుమల నుంచి చెన్నై చేరుకున్న త్రిష టీవీకే అధినేత విజయ్‌ ఇంటికి వెళ్లి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం త్రిష్‌ విశ్వంభర, కరుప్పు చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాల నుంచి త్రిష లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

Updated Date - May 04 , 2026 | 10:08 PM