హైదరాబాద్‌లో.. దక్షిణాది నిర్మాతల సమావేశం

ABN , Publish Date - May 11 , 2026 | 09:08 AM

హైదరాబాద్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సమావేశంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ నిర్మాతలు పాల్గొన్నారు.

south indian film producers

సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్ (ఎస్‌ఐఎఫ్‌పీఏ) (South Indian Film Producers Association) రెండో సమావేశాన్ని హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన నిర్మాతలు, నిర్మాణ సంస్థల ముఖ్య ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో పరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. నిర్మాణ వ్యయాలు, థియేట్రికల్‌ ఎగ్జిబిషన్‌, ఓటీటీ విండోయింగ్‌ విధానాలు, వర్క్‌ఫోర్స్‌ సమన్వయం, ఫిల్మ్‌ ఫైనాన్సింగ్‌ వంటి కీలకాంశాలపై చర్చలు జరిగాయి.

దక్షిణ భారత సినీ పరిశ్రమలో పాదర్శకత, సమిష్టి అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఒక ఏకీకృత, నిర్మాణాత్మక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సమావేశం పునరుద్ఘాటించింది. పరిశ్రమలోని అన్ని విభాగాల మధ్య సమన్వయపూర్వక విధానాలు, పరస్పర సహకారం మరింత బలోపేతం కావాల్సిన అవసరంపై సభ్యులు చర్చించారు. తదుపరి సమావేశం 2026 జూన్‌ 14న కొచ్చిలో నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

Updated Date - May 11 , 2026 | 10:02 AM