Parasakthi: శివ కార్తికేయన్, శ్రీలీల.. 'పరాశక్తి' ట్రైలర్ వచ్చేసింది
ABN , Publish Date - Jan 04 , 2026 | 07:54 PM
శివ కార్తికేయన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం పరాశక్తి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది.
శివ కార్తికేయన్ (Sivakarthikeyan), శ్రీలీల (Sreeleela) జంటగా రవి మోహన్ (Ravi Mohan), ఆథర్వ మురళి (Atharvaa) కీలక పాత్రల్లో నటించిన చిత్రం పరాశక్తి (Parasakthi). గతంలో సూర్యతో ఆకాశమే హద్దు చిత్రాన్ని రూపొందించిన తెలుగు దర్శకురాలు సుధా కొంగర (Sudha Kongara) డైరెక్ట్ చేసింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 10న ప్రపం వ్యాప్తంగా థియేటర్లకు వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఆదివారం రాత్రి ఈ మూవీ తమిళ ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్ కాస్త ఆలస్యంగా విడుదల కానుంది.
దేశానికి స్వాత్రంత్య్రం రాక పూర్వం 1937 లలో మద్రాస్ ప్రెసిడెన్సీ సమయంలో హిందీ తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ జరిగిన ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. కాలేజీలో చదువుతూ ఓపిక, ఆలోచన ఉన్న వ్యక్తిగా శివ కార్తికేయన్, తీవ్ర ఆగ్రహం, వెంటనే కొట్లాటలకు దిగే వ్యక్తిగా మురళీ నటించారు. ఇక క్రూరమైన పోలీస్ అధికారికగా రవి మోహన్, కాలేజీలో ఉద్యోగినిగా శ్రీలీల కనిపించనున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చాలా ఇంటెన్సివ్‌గా ఉండి, నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇదిలాఉంటే.. అతిథి పాత్రల్లో రానా దగ్గుబాటి, బసిల్ జోసప్ సైతం సినిమాలో కాసేపు కనిపించనున్నారు. వారి డిటెయిల్స్ ట్రైలర్‌లో మాత్రం ఎక్కడా కనిపించలేదు.