శివకార్తికేయన్.. 'సెయాన్' రెండో షెడ్యూల్ ప్రారంభం

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:25 AM

శివకార్తికేయన్ హీరోగా శివకుమార్ మురుగేశన్ తెరకెక్కిస్తున్న 'సెయాన్' రెండో షెడ్యూల్ మదురైలో ప్రారంభమైంది.

seyon

శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా తెరకెక్కుతున్న 'సెయాన్' (Seyon ) సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ మదురైలో ప్రారంభమైంది. సినిమాలోని పలు కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. ఇందుకోసం భారీ ఖర్చుతో ప్రత్యేక సెట్‌ను నిర్మించి షూటింగ్ నిర్వహిస్తున్నారు. ‘తాయ్ కిళవి’ (Thaai Kizhavi) వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శివకుమార్ మురుగేశన్ (Sivakumar Murugesan) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. నటుడు కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇందులో శివకార్తికేయన్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. అరుల్స్, రేచల్ రెబాకా, సింగంపులి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర పోషించనుండటం ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శివ కార్తికేయన్, సీమాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇవి కూడా చదవండి:

‘ఇప్పుడేం సమాధానం చెబుతారు? న‌టుడు గోవిందపై.. భార్య సునీత సంచలన వ్యాఖ్యలు!

చిరు లీక్స్.. మెగా 158 టైటిల్ ఇదే

హీరోగా మారుతున్న కేసీఆర్ మనవడు..


Updated Date - Aug 12 , 2026 | 12:10 PM