Dhanush: అజిత్‌కు ముందే ధనుష్‌తో సినిమా.. ‘సిరుత్తై’ శివ మాస్టర్ ప్లాన్ ఇదే!
ABN , Publish Date - Aug 30 , 2026 | 10:12 AM
కోలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతోందా? స్టార్ హీరో ధనుష్, మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు ‘సిరుత్తై’ శివ కలిసి ఓ సినిమా చేయనున్నారనే వార్తలు ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి
కోలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతోందా? స్టార్ హీరో ధనుష్(Dhanush) మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు ‘సిరుత్తై’ శివ (Shiva)కలిసి ఓ సినిమా చేయనున్నారనే వార్తలు ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అజిత్ కుమార్‌తో తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ముందు శివ.. ధనుష్‌తో ఓ సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ధనుష్ కోసం శివ ఓ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను తొలుత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మిస్తాయని వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ రెండు సంస్థలు ఈ సినిమాను నిర్మించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలిసింది.
ఇప్పుడు 7 స్క్రీన్ స్టూడియో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ధనుష్ మార్కెట్, శివ యాక్షన్ స్టైల్ కలిస్తే సినిమా భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉందనే అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు ‘సిరుత్తై’ శివ కూడా అజిత్ కుమార్‌తో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అజిత్ ప్రాజెక్ట్‌కు ముందు ధనుష్‌తో శివ సినిమా చేస్తారన్న వార్త ఆసక్తిని పెంచుతోంది. అయితే ధనుష్–శివ కాంబినేషన్ సినిమా, 7 స్క్రీన్ స్టూడియో నిర్మాణం వంటి విషయాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.